ఏపీలో ఫామ్ 7తో గంపగుత్తగా ఓట్ల తొలగింపుపై ఈసీ కీలక ఆదేశాలు..?
ఏపీలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, జనసేన మధ్య ఓట్ల తొలగింపు రచ్చ కొనసాగుతోంది. పరస్పరం ఓట్ల తొలగింపు ఆరోపణలు చేసుకుంటున్నారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి వైసీపీ ప్రభుత్వం బల్క్ ఫామ్ 7ల సమర్పణ ద్వారా ఓట్లను తొలగిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో అక్రమంగా ఓట్ల జాబితాలో చేర్చిన ఓట్లను మాత్రమే తొలగిస్తున్నట్లు వైసీపీ సర్కార్ చెబుతోంది. ఇదే అంశంపై ఈసీకి భారీ ఎత్తున ఫిర్యాదులు వెళ్తున్నాయి.
దీంతో ఎన్నికల సంఘం ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది. గంపగుత్తగా ఓట్ల తొలగింపు కోరుతూ ఫామ్ 7 దరఖాస్తులు సమర్పించేందుకు వీల్లేదని ఈసీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఈసీ ఆదేశాలు ఇచ్చినట్లు టీడీపీ నేత పయ్యావుల కేశవ్ వెల్లడించారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన పయ్యావుల కేశవ్ .. ఎన్నికల సంఘం ఉత్తర్వులపై వివరించారు. ఫామ్ 7 దరఖాస్తులపై టీడీపీ ఎప్పటి నుంచో అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందన్నారు. దీనిపై స్పందించి ఈసీ ఆదేశాలు ఇచ్చిందన్నారు.

ఇవాళ స్పష్టంగా ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చిందని, ఫాం-7 గంపగుత్త అప్లికేషన్లు తీసుకోవడానికి వీల్లేదని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ తెలిపారు. ఫామ్ 7 దరఖాస్తుల్ని బల్క్ లో తీసుకుంటుంటో అబ్జర్వర్లు ఏం పరిశీలించారో అర్థం కావట్లేదని ఆయన ఆరోపించారు. తప్పులు కళ్లముందే జరుగుతుంటే అబ్జర్వర్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తమ ఫిర్యాదులపై ఏం స్పందించారో అబ్జర్వర్లు చెప్పాలన్నారు.
ఎన్నికల అధికారులు నిష్పక్షపాతంగా పనిచేస్తే తాము ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు కదా అని పయ్యావుల అన్నారు. - ఓట్లు తొలగించాలని అధికారులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. ఓటు ఎక్కడ ఉండాలనేది ఓటరు హక్కని ఆయన తెలిపారు. రెండు ఓట్లు ఉంటే తప్పన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications