పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
గుంటూరు జిల్లా పొన్నూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఎన్నికల సంఘం ఆదేశించింది. పొన్నూరు మండలం ములుకుదురులో సీంఆర్ఎఫ్ చెక్కులను అంబటి మురళీ పంపిణీ చేశారు. దీనిపై తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వంశీకృష్ణ.. సీఈవో ముకేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో విచారణ చేపట్టిన అధికారులు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు నిర్ధరించారు. దీంతో అంబటి మురళీపై చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ను ఎన్నికల సంఘం ఆదేశించింది.

సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేగాక, హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్లొద్దని ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
కాగా, ఇటీవల వెంకట్రామిరెడ్డి కడప జిల్లా బద్వేలులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశమై వైసీపీకి ఓటు వేయాలని ప్రచారం చేశారని తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో ఈ వ్యవహారంపై కడప జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. వెంకట్రామిరెడ్డి పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.












Click it and Unblock the Notifications