మోగిన శాసనమండలి ఎన్నికల నగారా,టీచర్స్, గ్రాడ్యుయేట్స్ స్థానాలకు ఎన్నికలు
తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో టీచర్స్, గ్రాడ్యుయేట్స్ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమీషన్ విడుదల చేసింది.
హైదరాబాద్ :ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎంఏల్ సి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల నియామవళి తక్షణం అమల్లోకి వస్తోందని ఎన్నికల కమీషన్ ప్రకటించింది.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు స్థానాలకు, తెలంగాణలో ఒక్క స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు గ్రాడ్యుయేట్ స్థానాలతో పాటు, రెండు టీచర్ ఎంఏల్ సి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ ఒక్క టీచర్ ఎంఏల్ సి స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానం నుండి ప్రస్తుతం డాక్టర్ ఎంవిఎస్ శర్మ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన ఈ ఏడాది మార్చి 29వ, తేదితో రిటైర్ కానున్నారు. దీంతో ఈ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు.

ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రీనివాసులు రెడ్డి పదవీకాలం కూడ ఈ ఏడాది మార్చి 29వ నాటికి పూర్తి కానుంది, దీంతో ఎన్నికలు నిర్వహించనున్నారు. కడప, అనంతపూర్, కర్నూల్ స్థానాల నుండి డాక్టర్ గేయానంద్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ యన పదవి కాలం కూడ ఈ ఏడాది మార్చి 29వ, తేదికి పూర్తి కానుంది. దీంతో ఈ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు.
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల టీచర్స్ ఎంఏల్ సి స్థానం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న బాలసుబ్రమణ్యం పదవీకాలం ఈ ఏడాది మార్చి 29వ, తేదికి పూర్తి కానుంది.దీంతో ఈ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు.కడప, అనంతపూర్, కర్నూల్ టీచర్ ఎంఏల్ సి స్థానానికి బచ్చలి పుల్లయ్య ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన పదవీకాలం పూర్తికావడంతో ఈ స్థానానికి కూడ ఎన్నికలు నిర్వహించనున్నారు.
తెలంగాణలో కేవలం ఒక్క స్థానానికి మాత్రమే ఎన్నికలు నిర్వహించనున్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైద్రాబాద్ టీచర్ ఎంఏల్ సి స్థానానికి మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానం నుండి ప్రస్తుతం కె.జనార్థన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ఈ నెల 13వ, తేదిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నుండి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 20వ, తేది వరకు నామినేషన్ల స్వీకరణకు చివరి తేది.నామినేషన్ల పరిశీలనను ఈ నెల 21న, చేస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 23వ, తేది చివరి తేదిగా నిర్ణయించారు. మార్చి 9వ, తేదిన ఎన్నికలు నిర్వహించనున్నారు.మార్చి 15వ, తేదిన కౌంటింగ్ నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications