వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెరిగిన సంఖ్య.. ఏ పార్టీకి లాభం : 2014 లో 3.67 ఓట్ల ఓట‌ర్లు : 2019 లో 3.93 కోట్ల మంది ఓట‌ర్లు ...!

|
Google Oneindia TeluguNews

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏపి ఓట‌ర్ల తుది జాబితా విడుద‌ల అయింది. 2014 లో ఏపి ఓట‌ర్ల జాబితా ప్ర‌కారం 3.67 కోట్లు ఉం డ‌గా..ఇప్పుడు అది 3.93 కోట్ల‌కు చేరింది. 2014 ఎన్నిక‌ల్లో అధికార కూట‌మి- ప్ర‌తిప‌క్షం మ‌ధ్య ఓట్ల లేదా కేవ‌లం 1.95 శాతం దాదాపు అయిదు ల‌క్ష‌ల ఓట్లు. ఇక‌, ఇప్పుడు గ‌త కంటే 26 ల‌క్ష‌ల ఓట్లు పెరిగాయి. ఇవి ఏ పార్టీకి మేలు చేస్తాయి..

మెగా హీరోలు ఎక్క‌డ‌..? ఎన్నిక‌ల ప్ర‌చారంలో బాబాయికి బాస‌ట క‌లేనా..?మెగా హీరోలు ఎక్క‌డ‌..? ఎన్నిక‌ల ప్ర‌చారంలో బాబాయికి బాస‌ట క‌లేనా..?

ఏపిలో మొత్తం ఓట‌ర్లు..3.69 కోట్లు..

ఏపిలో మొత్తం ఓట‌ర్లు..3.69 కోట్లు..

ఏపిలో మొత్తం 3,93,45,717 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రత్యేక సమగ్ర సవరణ-2019కు సంబంధించి జనవరి 11న తుది జాబితా ప్రచురించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 24,12,626 మంది ఓటర్లు పెరిగారు. రెం డున్నర నెలల వ్యవధిలో ఈ పెరుగుదల చోటుచేసుకుంది. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో పురుష ఓటర్లు కంటే 4,17,082 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. అత్యధిక ఓటర్లు కలిగిన జిల్లాగా తూర్పుగోదావరి నిలవగా.. ఇక్కడ ఓటర్ల సంఖ్య 42 లక్షలు దాటింది. విజయనగరం చివరిస్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో ఓటర్ల సంఖ్య 18.18 లక్షలే. మిగతా అన్ని జిల్లాల్లోనూ ఓటర్ల సంఖ్య 20 లక్షల మార్కు దాటింది. రాష్ట్రంలో శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలు మిన హా మిగతా అన్ని జిల్లాల్లోనూ పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.

గాజువాక లో అత్య‌ధిక ఓట‌ర్లు..

గాజువాక లో అత్య‌ధిక ఓట‌ర్లు..

ఏపి లోని విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో ఓటర్లు ఉండగా...కృష్ణా జిల్లా పెడనలో అతి తక్కువ మంది ఓటర్లు ఉన్నారు. భీమిలి నియోజకవర్గంలో అత్యధికంగా, పెడన నియోజకవర్గంలో అ త్యల్పంగా మహిళా ఓటర్లు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో ఓటర్లు ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో గుంటూరు, విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయి. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో 29.88 శాతం మంది ఓట ర్లు తూర్పుగోదావరి, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల పరిధిలోనే ఉన్నారు. ఇక‌, రాష్ట్రంలో అత్యధికంగా గుంటూరు జిల్లాలో థర్డ్‌ జెండర్స్‌ ఓటర్లు ఉన్నారు. అతి తక్కువ ఓటర్లు కలిగిన జిల్లాల జాబితాలో విజయనగరం మొదటి స్థానం లో ఉండగా...ఆ తర్వాత శ్రీకాకుళం, కడప జిల్లాలు ఉన్నాయి.

పెరిగిన ఓట‌ర్లు 25 ల‌క్ష‌ల మంది..

పెరిగిన ఓట‌ర్లు 25 ల‌క్ష‌ల మంది..

2014 ఎన్నిక‌ల‌తో పోలిస్తే ప్ర‌స్తుత ఎన్నిక‌ల కు 25.84 ల‌క్ష‌ల మంది ఓట‌ర్లు పెరిగారు. 2014 ఎన్నిక‌ల్లో మొత్తం ఓట‌ర్లు 3,67,60,880 ఉండ‌గా, 2019 ఎన్నిక‌ల నాటికి 3,93,45,717 ఓటర్లు ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీని ద్వారా గ‌తం కంటే మొత్తం గా 25 ల‌క్ష‌ల 84 వేల 837 మంది ఓట‌ర్లు పెరిగారు. ఇక‌, జనవరి 11 నాటికి రాష్ట్రంలో ఓటర్లు: 3,69,33,091 కాగా, ఇక , తొలి గించిన ఓట్లు.. 1,41,823 గా నిర్ధారించారు. ఇందులో చేర్చిన ఓట్లు: 25,54,449 గా ప్ర‌క‌టించారు. ఇక‌, ఇప్పుడు రాజ‌కీయ పార్టీలు పెరిగిన ఓట్లు ఎక్క‌డ ఏ మేర పెరిగాయి.. ఏ వ‌ర్గానికి చెందిన వారి ఓట్లు అధికంగా ప్ర‌భావితం చూపుతాయి అనే అంశం పై ఇప్పుడు దృష్టి సారించాయి.

English summary
AP election CEO relased Voters final list for 2019. In 2014 total voters 3.67 cr. Now this increased to 3.93 cr. Now contesting parties concentrated on new voters list.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X