ఏపీ ఎన్నికల్లో ఈసీ సక్సెస్ - భారీ పోలింగ్ వెనుక కారణాలివే ? అదొక్కటే మైనస్..!

ఈసారి ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన సవాల్ ను ఈసీ విజయవంతంగా ఎదుర్కొంది. ముఖ్యంగా ఓటర్ల జాబితాల తయారీ నుంచి మొదలుపెడితే ఎన్నికల పోలింగ్ వరకూ ఎదురైన పలు సవాళ్లను పరిష్కరించడంలో ఈసీ చూపిన చొరవ ప్రభావం పోలింగ్ రోజు కనిపించింది. రాష్ట్రంలో దాదాపుగా గత ఎన్నికల పోలింగ్ తో సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా పోలింగ్ నమోదవుతుందన్న అంచనాల వెనుక ఈసీ ఎలా సక్సెస్ అయిందో ఇప్పుడు చూద్దాం..

ఈసీ చర్యలు ఫలప్రదం

ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగాలంటే ముందుగా ఈసీ అనేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఓటర్ల జాబితాలను నిష్పక్షపాతంగా తయారు చేయడం దగ్గరి నుంచీ పోలింగ్ రోజు ఓటర్లతో సాఫీగా ఓటు వేయించే వరకూ చాలా చర్యలు ఉంటాయి. ఇందులో ఈసీ ఎంత పకడ్బందీగా వ్యవహరించిందనే దాన్ని బట్టి పోలింగ్ శాతాలు కూడా ఆధారపడి ఉంటాయి. ఓటర్లలో ఈసీ నింపే చైతన్యం అన్నింటికంటే మించి వారిని పోలింగ్ కేంద్రాలకు రప్పిస్తుంది. ఇందులో ఈసీ ఈసారి విజయవంతమైంది.

election commission successful efforts behind huge voter turnout despite some odds

ఓట్ల గల్లంతుల్లేవ్..

నిన్న జరిగిన పోలింగ్ లో ఎక్కడా ఓట్ల గల్లంతు ఆరోపణలు వినిపించలేదు. ఏ ఒక్క పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ జరిగిందన్న ఫిర్యాదులూ లేవు. అక్కడక్కడా ఈవీఎంల సమస్యలు ఎదురైనా వాటిని అతి తక్కువ సమయంలో పరిష్కరించడం ద్వారా తిరిగి ఓటింగ్ జరిగేలా చూడటంలో ఈసీ సక్సెస్ అయింది. అంతిమంగా ఓటర్లను నిర్భయంగా పోలింగ్ బూత్ కు వచ్చి ఓటేసేలా చూడటంలో ఈసీ విజయవంతం అయినట్లు అర్థమవుతోంది.

హింస అరికట్టడంలో విఫలం

అదే సమయంలో ఎన్నికల సందర్భంగా పదుల సంఖ్యలో నియోజకవర్గాల్లో చెలరేగిన హింసను అరికట్టడంలో ఈసీ విఫలమైంది. గతంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగిన పెనమలూరు, గన్నవరం వంటి నియోజకవర్గాల్లో ఈసారి హింస చెలరేగడం ఈసీ చర్యల్ని ప్రశ్నార్ధకంగా మార్చింది. అయితే తక్కువ సమయంలోనే వాటిని అదుపులోకి తీసుకురావడంతో పాటు కఠిన చర్యలకు ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఎన్నికలకు ముందే ఉన్నతాధికారుల ఆకస్మిక బదిలీలతో ఈసీ కాస్త చెడ్డపేరు తెచ్చుకుంది.

రీపోలింగ్ అవసరం లేకుండా

అలాగే రాష్ట్రంలో స్ధానిక సంస్ధల ఎన్నికలు జరిగినా రీపోలింగ్ అనే మాట వినిపించేది. కానీ ఈసారి అసెంబ్లీ, పార్లమెంట్ కు ఎన్నికలు జరిగినా రీపోలింగ్ అవసరం ఉన్నట్లు కనిపించడం లేదని సీఈవో ముకేష్ కుమార్ మీనా నిన్న ప్రకటించారు. ముఖ్యంగా పలు చోట్ల హింస చోటు చేసుకున్నా రీపోలింగ్ కావాలంటూ ఏ రాజకీయ పార్టీ కూడా కోరలేదని సీఈవో చేసిన ప్రకటన ఎన్నికలు ఎలా జరిగాయో చెప్పకనే చెబుతోంది.

80 శాతం దాటనున్న పోలింగ్

అయితే పోలింగ్ రోజు కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహాయిస్తే అంతిమంగా భారీ పోలింగ్ శాతాలు నమోదు కావడం వెనుక ఈసీ కృషిని విస్మరించే పరిస్ధితి లేదు. ప్రజాస్వామ్యం అంటేనే భారీగా ఎన్నికల్లో ఓటర్లు పోలింగ్ బూత్ లకు వచ్చి ఓటేయడం. అలా వేసే పరిస్ధితి కల్పించడం. ఇందులో ఈసీ సక్సెస్ కావడం వల్లే ఇప్పుడు రాష్ట్రంలో 80 శాతం పోలింగ్ నమోదవుతుందన్న అంచనాలు వెలువడ్డాయి. మరే రాష్ట్రంతో పోల్చినా 80 శాతం పోలింగ్ అంటే ఎన్నికల్లో భారీ సక్సెస్ కిందే లెక్క.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+