ఏపీ సీఎస్, డీజీపీకి ఈసీ సమన్లు-ఎన్నికల తర్వాత హింసపై సీరియస్-ఢిల్లీ రావాలని ఆదేశం..
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత పలు జిల్లాల్లో చెలరేగిన హింసపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు రోజులుగా వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్న కేంద్ర ఎన్నికల సంఘం.. దీనిపై వివరణ ఇవ్వాలంటూ సీఎస్ జవహర్ రెడ్డితో పాటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో వారిద్దరూ ఢిల్లీ వెళ్లి వివరణ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు.
రాష్ట్రంలో ఈ నెల 13న జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో హింస చెలరేగింది. పోలింగ్ పూర్తి కాకముందే పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మాచర్ల,తాడిపత్రి,చంద్రగిరి,నరసరావుపేటలో చోటు చేసుకున్న ఘటనలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై తక్షణ చర్యలకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇవాళ సీఈవో ముకేష్ కుమార్ మీనా హింసకు కారణమవుతున్న నేతల హౌస్ అరెస్టులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే పోలీసులు ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు.

అయినా ఇంకా పలు చోట్ల హింస కొనసాగుతుండటంపై ఆగ్రహంగా ఉన్న ఈసీ.. ఢిల్లీ వచ్చి వీటిపై వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని సీఎస్, డీజీజీలకు సమన్లు పంపింది. దీంతో వీరిద్దరూ ఢిల్లీ వెళ్లి హింసకు గల కారణాలు, వాటిని అదుపు చేసేందుకు చేసిన ప్రయత్నాలపై ఈసీకి వివరణ ఇవ్వబోతున్నారు. ఏపీలో ఎన్నికల తరువాత జరుగుతున్న హింసను అరికట్టడంలో డీజీపీ, సీఎస్ లు విఫలమైనట్లు ఎన్నికల కమిషన్ అభిప్రాయపడింది. రేపు వీరు ఇచ్చే వివరణ ఆధారంగా ఈసీ తదుపరి చర్యలు ప్రకటించనుంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications