ఏపీలో విద్యుత్ షాక్: రేపటి నుంచి ఛార్జీలు పెంపు, వారికి మినహాయింపు
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి. పెరిగే విద్యుత్ ఛార్జీలు రేపటి నుంచి (శనివారం) నుంచి అమలులోకి రానున్నాయి. అయితే, వ్యవసాయానికి, 200 యూనిట్ల కంటే తక్కువ వాడే వారికి మినహాయింపు ఇచ్చారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి. పెరిగే విద్యుత్ ఛార్జీలు రేపటి నుంచి (శనివారం) నుంచి అమలులోకి రానున్నాయి. అయితే, వ్యవసాయానికి, 200 యూనిట్ల కంటే తక్కువ వాడే వారికి మినహాయింపు ఇచ్చారు.
పరిశ్రమలు, 200 యూనిట్లకు పైగా వాడే వారిపై భారం పడనుంది. రాష్ట్రంలో 15.47 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయని, వాటిపై ఎలాంటి ప్రభావం పడదని అధికారులు ెలిపారు.

పెంచిన ధరలు రేపటి నుంచి అమలులోకి వస్తాయన్నారు. 3.6 శాతం మేర ఛార్జీలు పెరుగుతున్నాయి. 200 యూనిట్ల లోపు వాడే వారికి, వ్యవసాయ కనెక్షన్లపై పెంపు లేనందున 90.5 శాతం మందిపై ఎలాంటి భారం ఉండదని చెప్పారు. 200 నుంచి 500 యూనిట్ల మధ్య వాడే వారిపై 3 శాతం భారం పడనుంది.












Click it and Unblock the Notifications