ఆసక్తికరంగా ఏలూరు ఎంపీ పోరు-కోటగిరి అవుట్ ? ఈసారి ఆళ్లనాని వర్సెస్ చింతమనేని ?

ఏలూరు ఎంపీ స్ధానంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల పోరు ఆసక్తిరేపుతోంది. సిట్టింగ్ ఎంపీ కోటగిరి శ్రీధర్ తప్పుకోనుండగా.. ఆయన స్ధానంలో ఆళ్లనాని.. టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగే చింతమనేనిని ఎదుర్కోబోతున్నారు.

ఏపీలో కాపు జనాభా అధికంగా ఉన్న లోక్ సభ నియోజకవర్గాల్లో ఒకటైన ఏలూరులో ఈసారి రాజకీయం కాక రేపుతోంది. ఎక్కడా వార్తల్లో కూడా కనిపించకుండా, వినిపించకుండా గుట్టుగాసాగిపోతున్న ఏలూరు ఎంపీ సీటు రాజకీయం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమవుతోంది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న కోటగిరి శ్రీధర్ మరోసారి పోరుకు మొగ్గుచూపడం లేదు. దీంతో ఆయన స్ధానంలో మాజీ మంత్రి ఆళ్లనాని రంగంలోకి దిగనుండగా.. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను చంద్రబాబు రంగంలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏలూరు ఎంపీ సీటు రాజకీయం

ఏలూరు ఎంపీ సీటు రాజకీయం

ఏలూరు ఎంపీగా 2019లో గెలిచిన కోటగిరి శ్రీధర్ ఈ నాలుగేళ్లలో తన మార్కు వేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. స్ధానికంగా బలమైన సామాజిక వర్గం కాకపోవడం, తొలిసారి ఎంపీ కావడం, స్ధానికంగా వైసీపీ నేతల నుంచి ఎదురైన ఆంక్షలు ఆయన్ను ఏలూరు ఎంపీ స్ధానంలో రాజకీయం చేసేందుకు ఎక్కడా అవకాశం లేకుండా చేసేశాయి. దీంతో కోటగిరి శ్రీధర్ మరోసారి ఎంపీగా పోటీ చేసేందుకు ఇష్టపడటం లేదని తెలుస్తోంది.

అలాగే అధిష్టానం కూడా ఆయన స్ధానంలో మరో ఎంపీ అభ్యర్ధిని సిద్దం చేసుకుంటోంది. మరోవైపు గతంలో ఎంపీగా పలుసార్లు గెలిచి 2019లో ఓటమిపాలైన మాగంటి బాబు స్దానంలో ఎంపీగా కొత్త పేర్లు తెరపైకి వచ్చేస్తున్నాయి.

కోటగిరి శ్రీధర్ అవుట్?

కోటగిరి శ్రీధర్ అవుట్?

ప్రస్తుతం వైసీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న కోటగిరి శ్రీధర్ మరోసారి ఎంపీ సీటులో పోటీ చేసే అవకాశాలు దాదాపు కనిపించడం లేదు. గతంలో ఆయన తండ్రి కోటగిరి విద్యాధరరావు పోటీ గెలిచి వరుసగా గెలిచిన చింతలపూడి నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కావడం, ఆ తర్వాత మారిన ఉంగుటూరు సైతం గెలుపు ఇవ్వకపోవడంతో చివరిగా తన సామాజికవర్గం వెలమదొరల జనాభా ఎక్కువగా ఉన్న నూజివీడువైపు కోటగిరి కన్ను పడుతోంది.

అయితే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న అదే సామాజికవర్గ నేత మేకా వెంకటప్రతాప్ అప్పారావు ఈసారి పోటీ చేయడం లేదు. ఆయన కుమారుడికి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈ స్ధానంలో తనకు టికెట్ లభించవచ్చని కోటగిరి భావిస్తున్నారు.

వైసీపీ ఎంపీగా ఆళ్లనాని పోటీ?

వైసీపీ ఎంపీగా ఆళ్లనాని పోటీ?

ఏలూరు ఎమ్మెల్యేగా ఇప్పటికే మూడుసార్లు గెలిచి జగన్ కేబినెట్లో ఆరోగ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆళ్లనానికి స్ధానికంగా పట్టున్నా.. వ్యతిరేకత తీవ్రంగా ఉంది. మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆళ్లనాని ఓటమి ఖాయమన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే ఏలూరు వైసీపీలో ఉన్న మూడు గ్రూపుల్లో ఒకరిగా ఉన్న ఆళ్లనాని... ఈసారి ఎంపీగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ఇప్పటికే ఎంపీగా ఉన్న కోటగిరి శ్రీధర్ కూడా తప్పుకునే అవకాశం ఉండటంతో ఎంపీ బరిలోకి దిగాలని ఆళ్లనాని భావిస్తున్నారు. దీంతో వైసీపీ ఎంపీగా ఆళ్లనాని పోటీ చేయడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి.

 టీడీపీ ఎంపీగా చింతమనేని ప్రభాకర్?

టీడీపీ ఎంపీగా చింతమనేని ప్రభాకర్?

అలాగే టీడీపీ తరఫున గతంలో పోటీ చేసి వరుస విజయాలు సాధించి 2019లో ఓడిపోయిన మాగంటి బాబు మరోసారి పోటీకి సిద్ధంగా లేరు. ప్రస్తుతం యాక్టివ్ గానే ఉంటున్నా ఎంపీ సీటులో పోటీకి ఆసక్తి చూపడం లేదు. దీంతో దెందులూరులో గత ఎన్నికల్లో ఓటమి తర్వాత సొంత సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న చింతమనేని ప్రభాకర్ ఈసారి ఏలూరు ఎంపీ సీటుపై కన్నేశారు.

ఏలూరు ఎంపీగా మాగంటి బాబు స్దానంలో ఆయన సామాజిక వర్గానికే చెందిన చింతమనేనిని బరిలోకి దించేందుకు టీడీపీ అధినేత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ బోళ్ల బుల్లి రామయ్య మనువడు బోళ్ల రాజీవ్ కూడా ఈ స్ధానం కోసం పోటీ పడే అవకాశం ఉన్నా చింతమనేని ధాటికి తట్టుకోవడం కష్టం. కాబట్టి చింతమనేని ఎంపీ బరిలో ఉంటారని చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+