సీఎం జగన్ పై పెరుగుతున్న ఒత్తిడి - విజయవాడలో మిలీనియం మార్చ్ : ఇచ్చిన హామీ నెరవేరేనా..!!

ఏపీ ప్రభుత్వం పై ఉద్యోగులు ఒత్తిడి పెంచే వ్యూహాలకు పదును పెడుతున్నారు. కొద్ది నెలల క్రితం పీఆర్సీ సాధన కోసం ఆందోళనకు దిగిన ఉద్యోగులు..సమ్మె వరకు వెళ్లేందుకు నిర్ణయించారు. ప్రభుత్వ చర్చలతో సమ్మె లేకుండానే సమస్య పరిష్కారమైంది. ఇక, ఇదే సమయంలో ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం పైన ఆందోళన తీవ్రతరం అవుతోంది. 2019 ఎన్నికలకు ముందు జగన్ తన పాదయాత్రలో అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేస్తానంటూ హామీ ఇచ్చారు. దీని పైన గత మూడేళ్లుగా ఉద్యోగ సంఘాలు పదే పదే నాడు ఇచ్చిన హామీని గుర్తు చేసారు.

సీపీఎస్ రద్దు హామీ అమలు కోసం

సీపీఎస్ రద్దు హామీ అమలు కోసం

ఇక, కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం అనూహ్యం గా కొత్త ప్రతిపాదన తెర మీదకు తీసుకొచ్చింది. రాష్ట్రంలో రాబడులకు మించి ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉండటంతో ఉద్యోగులకు మేలు చేకూర్చే విధంగా కొత్త పథకాన్ని అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. సీపీఎస్ స్థానంలో జీపీఎస్ అమలు చేస్తామంటూ పెద్ద ఎత్తున దాని గురించి వివరిస్తూ ప్రకటనలు ఇచ్చింది. ఉద్యోగ సంఘాల నేతలకు ఆర్దిక శాఖ అధికారులు వివరించారు. కానీ, దీని పైన ఉద్యోగ సంఘ నేతలు పెద్దగా సానుకూలత వ్యక్తం చేయలేదు. ఓపీఎస్‌ ఉద్యోగులకు చివరి పెన్షన్‌ చెల్లింపు మీద 50శాతం పెన్షన్‌ నిర్ణయిస్తారని, సీపీఎస్‌ ఉద్యోగులకు చివరి బేసిక్ చెల్లింపు మీద 20శాతం పెన్షన్‌ ఉంటుందంటూ లెక్కలు చెప్పారు.

మిలియన్ మార్చ్ కు నిర్ణయం

మిలియన్ మార్చ్ కు నిర్ణయం


రెండింటి బదులు కొత్తగా 33.5శాతం పెన్షన్‌ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఇచ్చిన సీపీఎస్‌ రద్దుకు కట్టుబడి ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో సీపీఎస్ రద్దు డిమాండ్‌తో మిలీనియం మార్చ్ చేపట్టాలని ఉద్యోగుల నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలోని ధర్నాచౌక్‌లో సీపీఎస్ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఉద్యోగుల డిమాండ్ చేసారు. 'దగాకోరు మోసం' అంటూ దీక్షా స్థలిలో బ్యానర్లు కనిపించాయి. సీఎం హామీ మేరకు సీపీఎస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేసారు. సీపీఎస్ రద్దు డిమాండ్‌తో మిలీనియం మార్చ్ చేపట్టాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 1న విజయవాడలో మిలీనియం మార్చ్ చేపట్టనున్నట్లు ప్రకటించారు.

ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి

ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి


4 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులతో మార్చ్ చేపట్టాలని ఉద్యోగ సంఘాల నేతలు నిర్ణయించారు. ఇకపై కలిసి ఉద్యమించాలని 2 ప్రధాన ఉద్యోగ సంఘాల నేతల నిర్ణయం తీసుకుంది. ఏపీసీపీఎస్ఈఏ, ఏపీసీపీఎస్‌ యూఎస్ కలిసి పోరాడాలని నిర్ణయించాయి, రెండు సంఘాలు కలిసి మిలీనియం మార్చ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో...మూడు నెలలకు పైగా ససమయం ఉండటంతో గతంలో ఇచ్చిన హామీ పేరుతో ఒత్తిడి పెరుగుతున్న వేళ..ఇప్పుడు సీఎం జగన్ ప్రభుత్వం ఏ విధంగా ముందుడుగు వేస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+