ఎన్‌కౌంటర్: కిడారి, సోమలను కాల్చివేసిన మావోయిస్టు నేత మీనా మృతి, నలుగురు మావోల అరెస్ట్
విశాఖపట్నం: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య శుక్రవారం చోటు చేసుకున్న ఎదురుకాల్పులు మన్యంలో మరోసారి ఉద్రిక్తతకు దారితీశాయి. విశాఖ మన్యంలోని పెదబయలు, ఒడిశా సరిహద్దు జామిగూడ పంచాయతీ ఆండ్రపల్లి కొండల్లో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి.
కాగా, పోలీసులు కాల్పుల్లో మీనా అనే మావోయిస్టు నేత మృతి చెందింది. ఇటీవల ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలను కాల్చి చంపిన మావోయిస్టు గ్రూపులో ఆమె కూడా పాల్గొన్నట్లు తెలిసింది. మీనాను ఏవోబీ ఇంఛార్జ్, మావోయిస్టు కీలక నీత గాజర్ల రవి అలియాస్ గణేష్ భార్యగా గుర్తించారు.

మరో నలుగురు మావోయిస్టులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అదుపులోకి తీసుకున్న మావోయిస్టులు జయంతి, రాధిక, గీత, రాజశేఖర్‌లను పోలీసులు విచారిస్తున్నారు.
కాగా, మరో 40మంది మావోయిస్టుల వరకు ఘటనా స్థలం నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా కొనసాగిస్తున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications