వివేకా హత్య కేసులో ఊహించని మలుపు- అవినాశ్ టార్గెట్ గా తెల్లవారు జాము నుంచి..!!
వివేకా హత్య కేసు కీలక మలుపు తీసుకుంది. ఆకస్మికంగా విచారణ అధికారులు రంగంలోకి దిగారు. కడప ఎంపీ అవినాశ్ రెడ్డి నివాసం కార్యాలయంతో పాటుగా ఈ కేసులో నిందితులుగా ఉన్న వారి నివాసాల్లో ఏక కాలంలో సోదాలు మొదలయ్యాయి. ఏపీలో నాలుగు చోట్ల, హైదరాబాద్ ఆరు చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ సోదాల వ్యవహారం రాజకీయంగా ఉత్కంఠ పెంచుతున్నాయి. తదనంతర పరిణామాల పైన చర్చ మొదలైంది.
వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ఇంట్లో, కార్యాలయాల్లో ఈడీ అధికారులు శుక్రవారం తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో కలిపి పది చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. మనీలాండరింగ్, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? అని ఆరా తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్ల కోసం వెతుకుతున్నారు. అలాగే అవినాశ్ రెడ్డి ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు. మరోవైపు, ఎంపీ అవినాశ్ రెడ్డితో పాటు వివేకా హత్య కేసు నిందితుల ఇళ్లపైనా ఈడీ అధికారులు దాడులకు దిగారు. పులివెందులలోని దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్ ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. తొండూరు మండలం టి.తుమ్మలపల్లిలో ఎర్ర గంగిరెడ్డి నివాసంలో తనిఖీలు జరుగుతున్నాయి. అలాగే, పులివెందుల లోని జగన్ సమీప బంధు సునీల్ రెడ్డి ఇంట్లోనూ సోదాలు చేస్తున్నారు.

ఏక కాలంలో పది చోట్ల సోదాలు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో హవాలా రూపంలో డబ్బులు చేతులు మారినట్లు అనుమానంతో ఈడీ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఎంపీ అవినాశ్ రెడ్డితోపాటు దస్తగిరి ఇళ్లలో సోదాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈడీ అధికారులు వేర్వేరు బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ సుదీర్ఘ విచారణ చేసింది. అవినాశ్ రెడ్డి లక్ష్యం గా వివేకా కుమార్తె సునీత కోర్టుల్లో పలు పిటీషన్లు దాఖలు చేసింది. సీబీఐ ఛార్జ్ షీటు దాఖలు చేసింది. ఈ కేసు భవిష్యత్ విచారణ కొనసాగుతుందా లేదా అనే సందేహం కొనసాగుతోంది. కోర్టు ల్లో నూ ఈ వ్యవహారం పెండింగ్ లో ఉంది. రాజకీయంగా ఈ కేసు సంచలనంగా మారింది. ఈ సమయంలో ఆకస్మికంగా ఈడీ అధికారులు చేస్తున్న సోదాలు మరోసారి ఆసక్తిగా మారాయి. భవిష్యత్ పరిణామాల పైన ఉత్కంఠ పెంచుతున్నాయి.













Click it and Unblock the Notifications