ఇంజనీరింగ్ విద్యార్ధిని ఆత్మహత్య, హోటల్‌లోకి లారీ
నెల్లూరు: నెల్లూరు జిల్లా కావలిలో ఓ ఇంజనీరింగ్ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. కావలిలోని విట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న భారతి అనే విద్యార్ధిని శుక్రవారం అర్ధరాత్రి హాస్టల్ గదిలో ఆత్మహత్యాయత్నం చేసుకుంది.
హెయిర్ డై తాగి ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న కాలేజీ యాజమాన్యం విద్యార్ధిని నెల్లూరులోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విద్యార్ధిని మృతి చెందింది.
భారతి స్వస్ధలం ఉదయగిరి మండలం కొండారెడ్డి పాలెం. ఐతే, మృతురాలి ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇంట్లో పేలిన సిలిండర్, ఒకరు మృతి
గుంటూరు జిల్లాలోని శావల్యాపురం మండలం కారుమంచిలో ఓ ఇంట్లో పేలిన సిలిండర్, ఒకరు మృతి చెందారు.
టీ హోటల్‌లోకి దూసుకెళ్లి లారీ, మహిళ మృతి
గుంటూరు జిల్లాలోని బోయపాలెంలో టీ హోటల్‌లోకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేప్టటారు.
స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం
ప్రకాశం జిల్లా కారంచేడు మండలం దగ్గుబాడు దగ్గర ఎస్‌ఎఫ్‌ఎస్ స్కూల్ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది. టైర్ పేలడంతో కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో విద్యార్థులకు స్వల్పగాయాలు అయ్యాయి.












Click it and Unblock the Notifications