ఇంజనీరింగ్ విద్యార్థి చోరీలు, కోడలికి మామ లైంగిక వేధింపులు
కరీంనగర్/కర్నూలు: ఏపీలోని కర్నూలు జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ఇంజినీరింగ్ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుండి రూ.11 లక్షల విలువైన బంగారం, నాలుగు కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు. జల్సాల కోసం అతను దొంగతనానికి పాల్పడుతున్నాడు.
కోడలికి మామ లైంగిక వేధింపు
కరీంనగర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఓ మామ తన కోడలి పైన లైంగిక వేధింపులకు పాల్పడుతుండటంతో గ్రామస్థులు అతనిని చితకబాది, పోలీసులకు అప్పగించారు.
మద్యం మత్తులో ఏడాదిన్నర బిడ్డను చంపిన తల్లి

మద్యం మత్తులో ఓ మహిళ తన ఏడాదిన్నర బిడ్డను బండకేసి కొట్టిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్‌కర్నూలు మండలం ఉయ్యాలవాడలో చోటు చేసుకుంది. చుట్టుపక్కల వారు వచ్చి చూసేసరికి ఆ చిన్నారి ప్రాణాలు పోయాయి. మద్యం మత్తులోనే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. గత కొంతకాలంగా ఆమె ఒంటరిగా ఉంటోంది.
ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
హైదరాబాదులోని హుస్సేన్ సాగర్‌లో దూకి ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో యువతి మృతి చెందింది. యువకుడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా కేంద్రంలో కూతురుతో సహా తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.












Click it and Unblock the Notifications