Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

TTD: బ్రహ్మోత్సవాల వేళ భక్తులకు ఈవో ధర్మారెడ్డి కీలక సూచనలు..!!

Tirumala: బ్రహ్మోత్సవాలకు తిరుమల సర్వం ముస్తాబు అయింది. ఇదే సమయంలో సామాన్య భక్తులకు బ్రహ్మోత్సవాల వేళ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. బ్రహ్మెత్సవాలు జరిగే 9 రోజులు ప్రత్యేక దర్శనాలు రద్దు చేసారు. ఆన్‌లైన్‌లో 1.30 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లతో పాటు సర్వదర్శనం భక్తులకు 24 వేల ఉచిత దర్శన టికెట్లు టీటీడీ అందించనుంది. నడకదారిలో ఆంక్షలు కొనసాగించాలని నిర్ణయించారు.

బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో బ్రేక్‌ దర్శనాలకు, సిఫారసు లేఖలను అనుమతించబోమని ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేసారు. తిరుమలలో సెప్టెంబర్‌ 18 నుంచి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు సెప్టెంబర్‌ 17న రాత్రి 7 నుంచి 8 గంటల వరకు వైఖానస ఆగమ శాస్త్రాన్ని అనుసరించి అంకురార్పణం జరగనుంది. ఇందులో భాగంగా శ్రీవారి తరఫున సేనాధిపతి అయిన శ్రీవిష్వక్సేనుల వారు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. అనంతరం ఆలయంలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటి వాటికి మొలకలొచ్చేవరకు నీరు పోస్తారు. ఆ తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు.

EO Dharma Reddy made Key announcements ahead Briahmotsavams, says Priority for Common Devotees

18వ తేదీన సీఎం జగన్‌.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం 6.15 నుండి 6.30 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 18న రాత్రి 9 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు 7 తలల స్వర్ణ శేషవాహనంపై (పెద్ద శేషవాహనం) మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు. 19న ఉదయం 8 గంటలకు 5 తలల చిన్నశేష వాహనంపై, రాత్రి 7 గంటలకు శ్రీమలయప్పస్వామి హంస వాహనంపై సరస్వతిమూర్తి అవతారంలో దర్శనం ఇవ్వనున్నారు. 20న ఉదయం 8 గంటలకు సింహ వాహనంపై, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతారు.

21న ఉదయం 8 గంటలకు శ్రీమలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై, రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిస్తారు. 22న ఉదయం 8 గంటలకు శ్రీవారు మోహినీరూపంలో శృంగారరసాధి దేవతగా దర్శనమిస్తారు. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంలో ఊరేగుతారు. 23న ఉదయం 8 గంటలకు శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగుతారు. సాయంత్రం శ్రీనివాసుడు స్వర్ణరథంపై, రాత్రి 7 గంటలకు గజవాహనంపై తిరువీధుల్లో విహరిస్తారు.24న ఉదయం సూర్యప్రభ వాహనంపై, రాత్రి చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. 25న ఉదయం శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అదే రోజు రాత్రి 7 గంటలకు స్వామివారు అశ్వ వాహనంపై విహరిస్తారు.

26న ఉదయం 6 గంటలకు చక్రస్నానాన్ని, రాత్రి 7గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అనంతరం ధ్వజావరోహణాన్ని శాస్త్రోక్తంగా చేపడతారు. దీంతో తొమ్మిది రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. స్వయంగా వచ్చే ప్రొటోకాల్‌ ప్రముఖులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రివిలైజ్డ్‌ దర్శనాలూ రద్దు చేసారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో ఉదయం వరకు, రాత్రి వరకు వాహన సేవలు ఉంటాయి. సెప్టెంబర్‌ 22న గరుడ సేవ కారణంగా.. ఘాట్‌ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలు రద్దు చేసినట్లు ఈవో వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+