టీడీపీ 'కీ': కేసీఆర్‌కు ఎర్రబెల్లి ఆఫర్, మాకిస్తే.. మీకిస్తాం
హైదరాబాద్: వరంగల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల జడ్పీ చైర్మన్/చైర్ పర్సన్ ఎన్నికలో ఒకచోట తమకు మద్దతిస్తే మిగతా రెండు జిల్లాల్లో తాము సహకరిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీలకు తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రతిపాదించారు. సోమవారం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
జడ్పీ చైర్మన్లు, మండల పరిషత్ చైర్మన్ల ఎన్నిక విషయంలోనూ టీడీపీ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. జడ్పీ, ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో టీడీపీ ఈ మూడు జిల్లాలకు పర్యవేక్షకులను నియమించింది. వరంగల్‌కు రావుల చంద్రశేఖర్ రెడ్డి, రంగారెడ్డికి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహబూబ్‌నగర్‌కు వేంన రేందర్‌రెడ్డి బాధ్యులుగా ఉంటూ, ఆయా జిల్లాల జడ్పీటీసీ సభ్యులతో సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు.

జడ్పీ పీఠానికి సంబంధించి టీడీపీ మద్దతు అనివార్యమైన నేపథ్యంలో కాంగ్రెస్, తెరాస నేతలు ఆ పార్టీ సీనియర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. వరంగల్ జిల్లాలో టీడీపీకి చెందిన జడ్పీటీసీ సభ్యులు నలుగురు తెరాస శిబిరంలో, మరో ఇద్దరు కాంగ్రెస్ శిబిరంలో చేరారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తెరాస, కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారట.
మొదట వరంగల్ జడ్పీ వైస్ పీఠంపై కన్నేసిన టీడీపీ, మూడు జిల్లాల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో చైర్మన్ కుర్చీనే దక్కించుకోవాలన్న ఆలోచనతో ఉంది. మూడు జిల్లాల్లో ఏదో ఒక జిల్లాలో తమకు అవకాశం ఇచ్చినా, మిగతా రెండు జిల్లాలో ఆ పార్టీకి మద్దతిస్తామని ప్రకటించడంతో స్థానిక రాజకీయం రసవత్తరంగా మారింది. వేరే పార్టీల శిబిరాల్లో ఉన్న వరంగల్ జిల్లా టీడీపీ జడ్పీటీసీ సభ్యుల్ని వెనక్కు రప్పిస్తున్నారు.












Click it and Unblock the Notifications