టిటిడిఎల్పి ఛైర్మన్‌గా ఎర్రబెల్లి: సభా పక్షనేతగా తలసాని

తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా రేవంత్ రెడ్డి, ఆర్. కృష్ణయ్యలను ఎంపిక చేశారు. శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ పక్షనేతగా అరికెల నర్సారెడ్డి వ్యవహరించనున్నారు. తెలంగాణ అసెంబ్లీలో విప్‌గా సండ్ర వెంకట వీరయ్యను నియమించారు.
చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడితో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు చైతన్యరాజు, రవికిరణ్ వర్మ శనివారం ఉదయం సమావేశమయ్యారు. త్వరలో వీరు టిడిపిలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు కాంగ్రెస్‌పార్టీ మద్దతుదారులుగా ఉన్న వీరు కొంత కాలంలో పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడుతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. చంద్రబాబును అభినందించేందుకే వచ్చినట్లు సమావేశం అనంతరం చైతన్యరాజు, రవికిరణ్ వర్మలు తెలిపారు.












Click it and Unblock the Notifications