ఇకనైనా వైఖరి మార్చుకో, మేమొస్తాం: కెసిఆర్‌పై ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు సోమవారం మండిపడ్డారు. కెసిఆర్, తెరాస వైఖరి పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాణ స్వీకారానికి తమ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును ఆహ్వానించకపోవడమేమిటన్నారు.
వ్యక్తిగతంగా ఆహ్వానించకుండా... కనీసం ఒక బృందాన్నైనా పంపించకుండా చంద్రబాబును ఆహ్వానించామని కెసిఆర్ చెప్పడం ఎంత వరకు సరైందన్నారు. అందరికీ పంపినట్టుగా ప్రభుత్వం ద్వారా లేఖ పంపి చంద్రబాబును అవమానించారన్నారు. ఇంత జరిగినా తాము గౌరవాన్ని, హోదాను తాము కాపాడుకుంటామన్నారు.

ఈ నెల 8న జరిగే ప్రమాణ స్వీకారానికి కెసిఆర్‌కు చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి పిలుస్తారని చెప్పారు. అంతేకాకుండా కొంతమంది నేతలం ఒక బృందంగా వెళ్లి కెసిఆర్‌ను ఆహ్వానిస్తామన్నారు. కెసిఆర్, తెరాసలు ఇకనైనా తమ పద్ధతిని మార్చుకుంటే బాగుంటుందన్నారు.
వేరుపడినా సహకరించుకోవాలి: బొత్స
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు వేరుపడినా తెలుగు వారు ఒక్కటేనని పిసిసి మాజీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ వేరుగా అన్నారు. అభివృద్ధిలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు సహకరించుకోవాలన్నారు.
దానం శుభాకాంక్షలు
తెలంగాణ ప్రజలకు, కెసిఆర్, ఆయన మంత్రివర్గానికి మాజీ మంత్రి దానం నాగేందర్ శుభాకాంక్షలు తెలిపారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి తాము సహకరిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజల మనసుల్లో సోనియా చిరస్థాయిగా నిలుస్తారన్నారు.
బంగారు తెలంగాణ కోసం కృషి: పొన్నాల
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు గాంధీ భవన్లో జరిగాయి. ఈ సందర్భంగా టిపిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తామని చెప్పారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు.
కెసిఆర్‌కు జెపి అభినందనలు
కెసిఆర్‌కు జయప్రకాశ్ నారాయణ అభినందనలు తెలిపారు. కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నానని, ఇరు రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలన్నారు.












Click it and Unblock the Notifications