మాట నిలబెట్టుకున్న నారా లోకేష్, తెర మీదకు కొత్త కార్పొరేషన్, ఇచ్చిన మాట
ఆంధ్రప్రదేశ్ లో మాజీ సైనికుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశం కోసం సేవలందించిన మాజీ సైనికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మంత్రి నారా లోకేష్ గతంలో ఆయన చేపట్టిన యువగళం పాదయాత్ర సమయంలో మాజీ సైనికులకు హామీ ఇచ్చారు. ఇప్పుడు మాజీ సైనికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ సైనికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని నారా లోకేష్ యువగళం పాదయాత్ర లోనే మాజీ సైనికులు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే మాజీ సైనికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చామని మంత్రి నారా లోకేష్ అన్నారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని మంత్రి నారా లోకేష్ ఇటీవల స్పష్టం చేశారు.

ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని, ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను త్వరలోనే నెరవేరుస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు. యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన ఆర్థిక విధ్వంసం కారణంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కొంచెం సమయం పట్టినా ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతామని, అందులో ఎవ్వరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదని మంత్రి నారా లోకేష్ అన్నారు.
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మాజీ సైనికుల కోసం కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలపడం సంతోషంగా ఉందని మంత్రి నారా లోకేష్ వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ టీడీపీ నాయకుడు నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే తమకోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మాజీ సైనికులు నారా లోకేష్ కు వినతిపత్రం సమర్పించారు.
యువగళం పాదయాత్ర సందర్భంగా వచ్చిన వినతిపత్రాలను పరిశీలిస్తున్న మంత్రి నారా లోకేష్ వాటిని పరిశీలించి ఒక్కొక్కటి అమలు చేయాలని నిర్ణయించారు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి నారా లోకేష్ ఆయన సన్నిహితులతో అన్నారని తెలిసింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారి మాజీ సైనికుల కోసం కొత్తగా ఓ కార్పొరేషన్ తెర మీదకు వచ్చింది.












Click it and Unblock the Notifications