టెక్కీ అనూహ్య మృతి: తెలిసిన వారి ట్రాప్‌లో పడ్డారా?
హైదరాబాద్: మహారాష్ట్రలోని ముంబైలో మృతి చెందిన సాఫ్టువేర్ ఇంజనీర్ అనూహ్య హత్య తెలిసినవారి పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనే పలువురిని ముంబై పోలీసులు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆటోలు, క్యాబ్ డ్రైవర్లను విచారిస్తున్నారు.
అనూహ్యకు చెందిన లగేజీ పోలీసులకు దొరగలేదు. అది ఎక్కడుందో తెలిస్తే దాని ఆధారంగా దర్యాఫ్తు వేగవంతమవుతుందని పోలీసులు భావిస్తున్నారు. అనూహ్య మీద లైంగిక దాడి జరిగిందా లేదా అనేది ఫోరెన్సిక్ నివేదికలో తెలుస్తుందని చెబుతున్నారు. అదృశ్యమైన రోజు అనూహ్య ఉదయం నాలుగున్నర గంటలకు లోకమాన్య తిలక్ టెర్మినల్‌లో రైలు దిగారని, అప్పుడు జనసమ్మర్తంగా ఉంటుందని, కిడ్నాప్ చేయడం కష్టసాధ్యమని భావిస్తున్నారు. దీంతో తెలిసిన వారే హత్య చేశారా అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు.

అనూహ్య మృతదేహం ఉన్న సమీపంలో పివిసి ఫిల్మ్ లేబుల్ ఏడు డబ్బులు లభించాయి. మండే స్వభావం కలిగిన ఈ ద్రావణంతో పాటు మరికొంత కిరోసిన్, పెట్రోలు లేదా యాసిడ్‌తో ఆ డబ్బాలపై ఉన్న వివరాలు, బ్యాచ్ నెంబర్ల ఆధారంగా వీటిని విక్రయించిన దుకాణాల ద్వారా సమాచారం సేకరిస్తారు.
తండ్రితో మాట్లాడిన కిరణ్
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనూహ్య తండ్రితో ఆదివారం ఫోన్లో మాట్లాడారు. ఆమె కుటుంబానికి కిరణ్ సానుభూతి తెలియజేశారు. అనూహ్య మృతికి సంబంధించి నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని కిరణ్ కుమార్ రెడ్డి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.












Click it and Unblock the Notifications