వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరం పూర్తవుతుందా?: పునరావాసం మిలియన్ డాలర్ల ప్రశ్నేనా?

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఇటు చంద్రబాబు, అటు నరేంద్రమోదీ ప్రభుత్వాలకు ప్రతిష్ఠాత్మకం.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

అమరావతి: గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఇటు చంద్రబాబు, అటు నరేంద్రమోదీ ప్రభుత్వాలకు ప్రతిష్ఠాత్మకం. కానీ ఈ ప్రాజెక్టు కింద నిర్వాసితులయ్యే వారికి మెరుగైన పునరావాసం కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.58,319 కోట్లు అవసరమని కేంద్రంలోని 'పోలవరం అథారిటీ', కేంద్ర జల సంఘా'నికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నివేదిక సమర్పించింది.

అందులో దీనికి పోలవరం పునరావాస వ్యయం అంచనాలే రమారమీ రూ.33, 358 వేల కోట్లని తేలింది. అదీ కూడా 2013 - 14 నాటి అంచనాల ప్రకారమే సుమా.. దీని ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 2018 - 19 లోగా పూర్తి కావాల్సి ఉన్నది.

ఐదేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత ఉన్నా.. తొలినాళ్లలో పట్టించుకోని సర్కార్... మూడేళ్లు గడిచిన తర్వాత పుణ్యకాలం పూర్తిగా ముగిసి పోయాక వ్యయం అంచనాలు ఎందుకు పెంచిందన్నదని మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిందని విశ్లేషకుల అభిప్రాయం.

Estimations OK, but what about that future of Polavaram rehabilitation?

నిజాయితీగా, నిఖార్సుగా పనిచేసే అధికారులు, కాంట్రాక్ట్ సంస్థలు ఉంటే ఇంత భారీగా వ్యయం పెరుగుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పునరావాసానికి ప్రాజెక్టు వ్యయంలో సగ భాగం కేటాయించిన ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేసిన తీరు సందేహాలకు తావిస్తున్నదని, నిర్వాసితులకు పునరావాస కల్పనే ప్రధాన అడ్డంకిగా మారనున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సగం ఖర్చు పునరావాసం కోసమే

Recommended Video

Malladi Vishnu, Sunkara Padma, Devineni Uma : War Of Words about Polavaram Project - Oneindia Telugu

వేల కోట్లలో పునరావాసానికి నిధులు ఖర్చు చేయాల్సి రావడంతోపాటు అదే స్థాయిలో ప్రాజెక్టు నిర్మాణానికి వెచ్చించాల్సి ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు పోలవరం ప్రాజెక్టు తమకు వర ప్రదాయిని అంటూనే మరోవైపు పట్టిసీమ, పురుషోత్తముని పట్నం తదితర ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నది.

ఈ నేపథ్యంలోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కింద నిర్వాసితులైన వారికి నిర్దేశిత పునరావాస చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు కింద భూసేకరణ, పునరావాస చర్యలు అమలు చేస్తున్నామని అధికార యంత్రాంగం చెప్తున్నా.. ఆచరణలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నదని విమర్శలు వినిపిస్తున్నాయి. ముంపు ప్రాతాల పునరావాస, పునర్నిర్మాణ పథకం రూపకల్పనలో సరైన పారదర్శకత లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రధాన కాలువల పరిధిలో తొలుత గ్రావిటీ ద్వారా నీటి సరఫరా కోసం కనీస స్థాయిలో నీటి నిల్వలు 41.15 మీటర్ల కాంటూరు స్థాయిలో నీరు నిల్వ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రస్థాయి అధికార యంత్రాంగం తాము రూపొందించిన పునరావాస పథకాన్ని ఆయా ప్రాంతాల్లోనే కాక మండల, డివిజన్, ఐటీడీఏ స్థాయిలో ప్రచారం చేయలేకపోయారన్న మాటలు వినిపిస్తున్నాయి.

పూర్తి పునరావాసం కల్పించకుండానే నిర్వాసితుల తరలింపు

ముఖ్యంగా పూర్తిస్థాయి పునరావాసం కల్పించకుండా నిర్వాసితులను తరలిస్తారన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. తమ సందేహాలు వ్యక్తం చేసి, పూర్తిస్థాయిలో పునరావాసం కల్పిస్తారన్న ఆశలు నిర్వాసితుల్లో భరోసా కల్పిస్తారన్న నమ్మకాలు మాత్రం కనిపించడం లేదు. తూర్పు గోదావరి జిల్లాలోని ఐదు మండలాల్లోని 234 గ్రామాలను తక్షణం తరలించేస్తున్నారన్న అపోహను కూడా అధికార యంత్రాంగం తొలగించలేకపోతున్నది. పోలవరం ప్రాజెక్టు కింద తొలుత గ్రావిటీ కింద నీటి తరలింపునకు వీలుగా 41.15 మీటర్ల కాంటూరు స్థాయిలోనే నీటిని నిలువ చేస్తారని, ఈ దశలో మూడు మండలాల్లోని 50 గ్రామాలు మాత్రమే ముంపునకు గురవుతాయని చెప్తున్నారు.

అందునా దేవీ పట్నం మండలంలో 38 గ్రామాలు, వీఆర్ పురం మండలంలో 11, కూనవరంలో ఒక గ్రామం మాత్రమే మునుగుతాయని వివరించే అధికారి కనిపించడం లేదు. జిల్లా స్థాయి కమిటీ సమావేశాల్లో కలెక్టర్ కాదంటే జాయింట్ కలెక్టర్ మాత్రమే మొక్కుబడిగా పునరావాసంపై చర్చించడం మినహా సాధించే పురోగతి ఏమీ లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పునరావాసం అంశాన్ని వివరించే అధికార వ్యవస్థ అందుబాటులో లేదు. గతంలో పాక్షికంగానో, పూర్తిగానో కొందరికి పునరావాసం, పరిహారం అందినా మారిన తాజా పరిస్థితుల్లో ఇప్పుడు అందించే పునరావాస ఫలాలను కూడా తమ వారికి అందజేయాలన్న డిమాండ్ నిర్వాసితుల్లో వ్యక్తమవుతున్నది. అయితే చట్టంలో ఇందుకు సానుకూల అంశం కూడా ఉంది. అది ఆయా ప్రాంతాల్లో వర్తిస్తుందో, లేదో వివరించడంలో అధికారులు విఫలమవుతున్నారు.

ఐదేళ్లు దాటితే మళ్లీ పునరావాస చర్యలు చేపట్టాల్సిందే

పాతచట్టం ప్రకారం భూసేకరణ జరుగకపోయినా, ఆ మేరకు అవార్డు మంజూరు కాకపోయినా, ఒకవేళ అవార్డు మంజూరై ఐదేళ్లు దాటిన తర్వాత భూమిని స్వాధీనం చేసుకోకపోయినా చర్యలన్నీ నిష్ప్రయోజనమైంది. ఖచ్చితంగా కొత్త చట్టం ప్రకారం పునరావాసం అమలు చేయాల్సి ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఒక గ్రామంలోని కొందరికి పాత చట్టం ప్రకారం అవార్డు చెల్లించి, మిగతా వారికి చెల్లించకపోయినా పరిస్థితి మొదటికే వస్తుంది. నిర్వాసితుల సంగతి పక్కనబెట్టి అధికారులకు కూడా పునరావాసంపై అవగాహన లేకపోవడం విచిత్ర పరిణామంగా కనిపిస్తున్నది. ఉదాహరణకు దేవీపట్నం మండలంలోని ఏడు గ్రామాల ప్రజల్లో నిర్వాసితుల డిమాండ్లకు అనుగుణంగా 2016లో రాష్ట్ర ప్రభుత్వం రూ.55 కోట్ల సాయం అందించింది. ఇలాగే అన్ని గ్రామాలకు సాయం అందించాలని అధికారులు నివేదిస్తే ప్రజలకు లబ్ది చేకూరుతుందన్న మాటలు వినిపిస్తున్నాయి.

ఐటీడీఏ పట్ల సన్నగిల్లుతున్న నమ్మకం

సాధారణంగా గిరిజనులు తమ సమస్యల పరిష్కారానికి తమకు అండగా ఐటీడీఏ ఉంటుందని ధీమాగా ఉంటారు. పునరావాస చర్యల అమలు కోసం ప్రభుత్వం ఐటీడీఏ అధికారినే పరిపాలకుడిగా నియమించడం వల్ల కూడా తమ పునరావాస సమస్యలు పరిష్కరించాలని ఆయనను ఆశ్రయించేందుకు గిరిజనులు వెనుకాడుతున్నారు. తద్వారా ఐటీడీఏల పట్ల నమ్మకం సన్నగిల్లేలా చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

తొలిదశలో ముంపునకు గురయ్యే గ్రామాలు 80

తొలిదశలో ముంపునకు గురయ్యే గ్రామాలు ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో 80 వరకు ఉంటాయని అంచనా. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో 50 గ్రామాలు ఉంటాయని తెలుస్తున్నది. దేవీపట్నం, చింతూరు, కూనవరం, వర రామచంద్రపురం మండలాల్లోని ఈ గ్రామాల రైతులు, ప్రజలను తరలించాలంటే ఒక్కో కుటుంబానికి రూ.6.61 లక్షల నుంచి రూ.7.11 లక్షల వరకు ప్రయోజనం కల్పించాలి. జిల్లాలో తొలి దశలో 50 గ్రామాల పరిధిలో 7419 కుటుంబాలు నిర్వాసితులవుతుంటే తొమ్మిది గ్రామాల్లో 1204 కుటుంబాలకు మాత్రమే పునరావాస ప్రయోజనాలు కల్పించారు.
మిగతా 41 గ్రామాల్లో 3927 గిరిజన, 2,288 గిరిజనేతర కుటుంబాలకు పునరావాసం కోసం రూ.426 కోట్లు అవసరం. మొత్తం 50 గ్రామాలకు సుమారు రూ.1000 కోట్లు కావాల్సి ఉంది. తొలి దశలో ప్రతి కుటుంబానికి 2.5 ఎఖరాల చొప్పున 2,112 ఎకరాల భూమి సేకరించాల్సి ఉన్నది. కానీ ఇప్పటివరకు 486 ఎకరాల భూమి మాత్రమే సేకరించారు. పునరావాస కాలనీల కోసం 567 ఎకరాలు అవసరం కాగా, 200 ఎకరాలు మాత్రమే సేకరించారు. నిర్వాసితులకు సమగ్ర పునరావాసానికి రూ.950 కోట్లు కావాలి.

English summary
There is some doubts on Polavaram project completion because AP Government recently hiked estimations. In this estimations half of money to be expected spend for rehabilitation of villagers. As per AP re organisation act, Polavaram Project will complete before 2019 but ground level conditions were different.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X