'మాకూ కేసీఆర్‌లాంటి నాయకుడు కావాలి, ఇది ఏపీ ప్రజల అభిప్రాయం'
ఏపీని విభజించిన తీరు తెలుగు జాతికి శాశ్వత అవమానంగా మిగిలిపోతుందన్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల పైన తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శుక్రవారం నిప్పులు చెరిగారు.
హైదరాబాద్: ఏపీని విభజించిన తీరు తెలుగు జాతికి శాశ్వత అవమానంగా మిగిలిపోతుందన్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల పైన తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శుక్రవారం నిప్పులు చెరిగారు. ఏపీ ప్రజలు కేసీఆర్ లాంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నారన్నారు.
చంద్రబాబు తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందని ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాటలు 544 మంది ఎంపీలను అవమానించినట్లుగానే భావించవచ్చునని చెప్పారు.
విభజన సమయంలో కేసీఆర్ ఒక్కడే అంతమంది ఎంపీలను బలవంతంగా కూర్చోబెట్టి బిల్లు పాస్ చేయించగలడా అని నిలదీశారు. ఇధి సాధ్యమయ్యే పనేనా అని అడిగారు. ఎంపీలు ఏమైనా చిన్నపిల్లలా అన్నారు.
తెలంగాణతో పోటీ పడే సత్తా లేక చంద్రబాబు అక్కసుతో ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. దేశమంతా తెలంగాణను ఆమోదించినా చంద్రబాబు వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారన్నారు. తెలంగాణ అభివృద్ధిని ఆయన జీర్ణించుకోలేక అసహనంతో మాట్లాడుతున్నారన్నారు.

రేవంత్ రెడ్డి చేసిన సవాల్ పైన కూడా ఈటెల రాజేందర్ స్పందించారు. హౌసింగ్ పైన తమ కమిటీ రిపోర్టు ఇచ్చాక తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డితో బహిరంగ చర్చకు సిద్ధమని తెలిపారు.
చంద్రబాబు ఏమన్నారంటే...
రాష్ట్రాన్ని విభజించిన తీరు తెలుగు జాతికి శాశ్వత అవమానంగా మిగిలిపోతుందని, పార్లమెంటు తలుపులు మూసేసి విభజన బిల్లు ఆమోదించిన రోజు ఆవేశం వచ్చిందని, ఏ రోజు తాను అంత బాధపడలేదని, ఆ కోపాన్ని, అవమానాన్ని దిగమింగి శక్తి నిరూపిస్తానని శపథం చేశానని వ్యాఖ్యానించారు.
దాని ప్రకారమే చరిత్ర తిరగరాసేలా అమరావతి నగరాన్ని నిర్మిస్తానని, ప్రపంచాన్ని ఆకట్టుకునేలా దేశంలోనే అత్యున్నత రాజధానిగా రూపొందిస్తానని, రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన వారే అసూయపడేలా తీర్చిదిద్దుతానని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీనిపై ఈటెల ఆగ్రహించారు.
-
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications