వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ ఛీకొట్టినా, చీవాట్లు పెట్టినా అంతేనా: కిరణ్‌పై ఈటెల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Etela fires at Kiran Kumar Reddy
హైదరాబాద్/న్యూఢిల్లీ: ఛీకొట్టినా, చీవాట్లు పెట్టినా, అసహ్యించుకున్నా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుర్చీ మీద నుండి దిగడం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ మంగళవారం మండిపడ్డారు. ముఖ్యమంత్రికి పదవిలో కొనసాగే అర్హత ఏమాత్రం లేదన్నారు. ముఖ్యమంత్రికి చట్టాల పైన అవగాహన లేదన్నారు. రాష్ట్రాల ఏర్పాటు అధికారం కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు.

కిరణ్ తెలంగాణను అడ్డుకుంటామని చెబితే ఆ పార్టీకి చెందిన ఢిల్లీ పెద్దలు సందీప్ దీక్షిత్ ముఖ్యమంత్రులు విభజన ప్రక్రియను అడ్డుకోలేరని చెప్పారని, అంత మంచిగా చెప్పినా కిరణ్ వినిపించుకోకపోవడం ఏమిటన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి ప్యాకేజీ ఇవ్వడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, తెలంగాణ ప్రజలు అందరి క్షేమం కోరుతారన్నారు. సీమాంధ్రకు ప్యాకేజీ ఇస్తే అభ్యంతరం లేదని అయితే దగాపడ్డ తెలంగాణకు న్యాయం చేయాల్సిందేననన్నారు.

తెలంగాణ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేసిన పార్టీలు అన్ని ఇప్పుడు యూ టర్న్ తీసుకోవడం దారుణమన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించక పోవడం వల్ల నాలుగు లక్షల ముప్పై అయివేల నష్టం వాటిల్లిందన్నారు. తెలంగాణలో విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించక పోవడంతో తమ ప్రాంత ప్రజలు ఉపాధి కోల్పోయారన్నారు. జివోఎంకు తమ పార్టీ తరఫున నివేదిక ఇస్తామన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు అక్కడి ప్రజల పైన ప్రేమ లేదని అధికారం, పదవులు, హైదరాబాదు రియల్ ఎస్టేట్ పైనే ఉందని ఆరోపించారు. టి కాంగ్రెసు నేతలు జైత్రయాత్రలు చేయడం మాని విభజనపై కిరికిరి రాకుండా చూడాలన్నారు.

డిగ్గీతో డికె అరుణ, పళ్లం రాజులు భేటీ

మరోవైపు ఢిల్లీలో ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌తో రాష్ట్రమంత్రి డికె అరుణ, కేంద్రమంత్రి పళ్లం రాజులు వేర్వేరుగా భేటీ అయ్యారు. డికె అరుణ పాలమూరు జిల్లా సమస్యలను డిగ్గీతో చర్చించినట్లుగా తెలుస్తోంది. అలాగే గద్వాల జైత్రయాత్ర సభకు ఆహ్వానించారు.

English summary
TRSLP Etela Rajender on Tuesday fired at CM Kiran Kumar Reddy for his stand on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X