వైయస్ జగన్‌ను కలిసిన తెలంగాణ మంత్రి ఈటెల
హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం ఉదయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తన కుమారుడు నితిన్ వివాహానికి తప్పక రావాలని ఈ సందర్భంగా ఈటెల రాజేందర్.. జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు.
కాగా, ఈటెల కుమారుడు నితిన్ పెళ్లి జూన్ 18న హైదరాబాద్ నగరంలోని హైటెక్స్‌లో జరగనుంది. ఈ క్రమంలో మంత్రి ఈటెల రాజేందర్ ప్రముఖులను ఆహ్వానించే పనిలో బిజీగా ఉన్నారు.

ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును మంత్రి ఈటెల రాజేందర్ కలిశారు. గత శుక్రవారం ఉదయం గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబును కలిసిన ఈటెల.. తన కుమారుడు నితిన్ వివాహానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. అంతేగాక, ఏపీ మంత్రులను, ప్రముఖులను కూడా ఈటెల తన కుమారుడి వివాహానికి ఆహ్వానం పలికారు.












Click it and Unblock the Notifications