ఎవరు సీఎం అని రాయలసీమ డిసైడ్ చేస్తుంది ?, కింగ్ మేకర్ ఎవరో డిసైడ్ చేసిన ఓటర్లు !

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. వైసీపీ గూండాలు పోలింగ్ సక్రమంగా జరగకుండా చేస్తున్నారని, వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు, బీజేపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ లోని ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేశారు. అలాగే టీడీపీ నాయకుల మీద వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది.

ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ నాయకుల తలరాతలు ఈవీఎంలో భద్రపరిచిన ఓటర్లు జూన్ 4వ తేదీ మీ కథ ఉంది అంటూ సైలెంట్ అయిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో ఇంతకాలం నాయకుల మీద కసిగా ఉన్న ప్రజలు ఓటు అనే ఆయుధంతో సైలెంట్ గా ఓటు వేసి మా తీర్పు కోసం వేచి చూడండి అంటూ కామ్ గా ఉండిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది అని కచ్చితంగా క్లారిటీ లేకపోయినా ఓటర్ల మాత్రం అందరి జాతకాలు ఈవీఎంలో పెట్టేశారు.

Everyone is eagerly waiting to know which party the people of Rayalaseema will support

పలు ప్రాంతాల్లో దొంగ ఓట్లు వెయ్యడానికి ప్రయత్నించిన వారిని ప్రత్యర్థి పార్టీకి చెందిన పోలింగ్ బూత్ ఏజెంట్లు అడ్డుకున్నారు. మా ఓటు పీకేశారని, సొంత ఇళ్లల్లో నివాసం ఉంటున్న మా ఓట్లు తొలగించారని కొందరు ప్రజలు కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలన్నా ఇప్పుడు రాయలసీమలోని అన్ని జిల్లాలోని అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మీద ఆదారపడి ఉంటుంది.

గత ఎన్నికల్లో రాయలసీమలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన వైసీపీ ఇప్పుడు అదే రాయలసీమలో తమకు ఎక్కువ సీట్లు వస్తాయని ధీమాగా ఉంది. అలాగే టీడీపీ కూడా రాయలసీమలో తమకు మెజారిటీ సీట్లు వస్తామని అంచనా వేస్తోంది. అనంతపురం, కర్నూలు, కడప, అనంతపురం, అన్యమయ్య, చిత్తూరు, తిరుపతి. నంద్యాల, సత్యసాయి జిల్లాల్లోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్న నాయకులు గెలుపు మాదే అంటూ ఎవరి ఊహల్లో వాళ్లు ఉన్నారు.

రాయలసీమలోని కొన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో వార్ వన్ సైడ్ ఉన్నా కొన్ని నియోజక వర్గాల్లో టీడీపీ, వైసీపీల మధ్య తీవ్రపోటీ నెలకోని ఉంది. ఇక బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు రాయలసీమ బోణి కొడతమాని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కర్ణాటక, తమిళనాడులో నివాసం ఉంటున్న ప్రవాసాంధ్రులు ఈసారి భారీ సంఖ్యలో రాయలసీమలోని వారి సొంత ప్రాంతాలకు చేరుకుని ఓటు వేశారు. మొత్తం మీద రాయలసీమలో అత్యధిక సీట్లు కైవసం చేసుకునే పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+