ఏపీలో మరో ఈవీఎం ఘటన వెలుగులోకి..!
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘెర ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 164 ఎమ్మెల్యే సీట్లును కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. అయితే కూటమి గెలుపు వెనుక ఈవీఎం కుట్ర దాగి ఉందని వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. పక్కా వైసీపీ పోలింగ్ బూత్‌ల్లో కూడా కూటమికి మెజార్టీ సాధించడం పలు అనుమానాలకు దారి తీసింది. ఈక్రమంలో ఒంగొలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పలు పోలింగ్ బూత్‌లలో రీ-కౌంటింగ్ నిర్వహించాలని కోర్టుకెక్కారు.
వీవీప్యాట్లను పరిశీలించి స్లిప్పులను లెక్కించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా ఈసీ వ్యవహరించింది. వీవీప్యాట్లను పరిశీలించి స్లిప్పులను లెక్కించకుండా మాక్ పోలింగ్ నిర్వహించేందుకు వీలుగా 16 జులై 2024న ఈసీ టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను ఈసీ జారీ చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన బాలినేని తరపు న్యాయవాది .. ఈసీ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. దీనికి సంబంధించి తుది తీర్పు వెలువడాల్సి ఉంది. తాజాగా విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో ఈవీఎం తనిఖీ అనుమానాస్పదంగా మారింది.

గజపతినగరం అసెంబ్లీ సెగ్మెంట్ ఓట్లపై వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పోలింగ్ బూత్ నంబర్ 20, పెదకాద ఈవీఎం తనిఖీ చేయాలని, వీవీప్యాట్ లెక్కించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే వైసీపీ ఫిర్యాదుకు సంబంధం లేకుండా అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించడం వివాదాస్పదంగా మారింది.పెదకాద ఈవీఎంలో డేటా మొత్తం అధికారులు తొలగించినట్టు వైసీపీ నేతలు గుర్తించారు. వీవీప్యాట్ బాక్స్‌లోనూ వీవీప్యాట్‌లు కనిపించలేదు. ఈవీఎంలో డేటా తొలగించి కొత్త గుర్తులను అప్‌లోడ్ చేశారు. అయితే అధికారులు కొత్త గుర్తులతో మాక్ పోలింగ్ నిర్వహించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రం సీసీ ఫుటేజ్, బాటరీ లెవెల్ డేటాను ఇవ్వాలని వైసీపీ నేతలు ఎన్నికల అధికారులను డిమాండ్ చేసినప్పటికి ఫలితం లేకుండాపోయింది.












Click it and Unblock the Notifications