వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు కీలక నిర్ణయం: 'డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్' అప్పగింత! ఎందుకంటే..

|
Google Oneindia TeluguNews

ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టికే ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో డీలా ప‌డిన పార్టీ నేత‌ల‌కు ధైర్యం చెబుతున్న చంద్ర‌బాబు త‌న డిప్లొమాటిక్ పాస్ పోర్టును స‌రెండ‌ర్ చేసారు. ముఖ్య‌మంత్రి హోదాలో సాధార‌ణంగా ల‌భించే ఈ పాస్‌పోర్ట్‌ను విజ‌య‌వాడ‌లోని అధికారుల‌కు అప్ప‌గించారు. ఇక‌, సాధార‌ణ పాస్‌పోర్ట్ మాత్ర‌మే చంద్ర‌బాబు త‌న వ‌ద్ద ఉంచుకున్నారు.

స‌రెండ‌ర్ చేసారు..ఎందుకంటే

తెదేపా అధ్యక్షుడు ..మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స‌డ‌న్‌గా విజ‌య‌వాడ‌లోని పాస్‌పోర్టు కార్యాల‌యానికి వెళ్లారు. ముందుగా స‌మాచారం ఇవ్వ‌టంతో అక్క‌డ అధికారులు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేసారు. ముఖ్య‌మంత్రి హోదాలో త‌న‌కు గ‌తంలో కేంద్ర విదేశాంగ శాఖ జారీ చేసిన డిప్లొమాటిక్‌ పాస్‌పోర్టుని అక్కడ అప్పగించారు. తనకు సంబంధిం చిన సాధారణ పాస్‌పోర్టును తీసుకున్నారు, ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయ‌టంతో ఆయ‌న‌కు ఇక ప్ర‌స్తుతం ఆ డిప్లొమేటిక్ పాస్ పోర్ట్ తో అవ‌స‌రం లేదు. ప్ర‌తీ రాష్ట్ర ముఖ్య‌మంత్రికి కేంద్ర విదేశాంగ శాఖ ఈ పాస్‌పోర్ట్ ఇస్తారు. ఇక‌, ఇప్పుడు కొత్త ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు విదేశాంగ శాఖ ఈ పాస్‌పోర్టును ఇవ్వ‌నుంది. దీనికి వెసులుబాటు క‌ల్పిస్తూ మాజీ సీఎం ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

Ex CM Chandra Babu surrendered his Diplomatic pass port to External affairs ministry

హ‌డావుడి లేకుండానే చంద్ర‌బాబు..

చంద్ర‌బాబు స‌హ‌జంగా బ‌య‌కు వ‌స్తే మంది..మార్బ‌లం హడావుడి ఎక్కువ‌గా ఉండేది. కానీ, ఈనెల 23న ఎన్నిక‌ల ఫ‌ల‌తాలు వెల్ల‌డయిన‌ప్ప‌టి నుండి చంద్ర‌బాబు వ‌ద్ద ఆ హంగామా క‌నిపించ‌టం లేదు. టీడీఎల్పీ భేటీలో సైతం పార్టీ నుండి ఎన్నికైన ఎంపీలు..ఎమ్మెల్యేల స‌మావేవంలో ప‌లితాల ఎఫెక్ట్ స్ప‌ష్టంగా క‌నిపించింది. అయితే, నిర్మాణాత్మ‌క ప్ర‌తిప‌క్ష పాత్ర పోషిస్తామ‌ని చెబ‌తున్నారు. ఆ స‌మావేశం త‌రువాత పాస్‌పోర్టు కార్యాల‌యం వద్ద‌కు సైతం చంద్ర‌బాబు కేవ‌లం త‌న వ్య‌క్తిగ‌త స‌హాయ‌కులు..భ‌ద్ర‌తా సిబ్బంది మాత్ర‌మే వ‌చ్చారు. ఉండ‌వ‌ల్లి లోని చంద్ర‌బాబు నివాసం ప్రాంగణం సైతం నిర్మానుష్యంగా క‌నిపిస్తోంది.

English summary
Ex CM Chandra Babu surrendered his Diplomatic pass port to External affairs ministry. As Cm he got this official pass port.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X