వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అది నీ టైం-ఇది నా టైం : కిరణ్ సీఎంగా -నాడు జగన్‌కు స్కెచ్ : ఇప్పుడు పీసీసీ చీఫ్ గా..!!

By Lekhaka
|
Google Oneindia TeluguNews

ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తెర పైకి వస్తున్నాయి. వైఎస్సార్ మరణం తరువాత రోశయ్య ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలోనే జగన్ ఓదార్పు యాత్ర ప్రారంభించారు. హైకమాండ్ అడ్డు చెప్పింది. అయినా..జగన్ ప్రజల్లోకి వెళ్లారు. జనం బ్రహ్మరధం పట్టారు. వాటి మూడ్ ఏంటో జగన్ కు అర్దమై పోయింది. అయినా..కొందరి సూచనల మేరకు పార్టీలోనే కంటిన్యూ అయ్యారు. కిరణ్ సీఎం అయ్యారు. అప్పటికే జగన్ భావం అర్దం చేసుకున్న పార్టీ హైకమాండ్ ఏరి కోరి కిరణ్ కు సీఎంగా బాధ్యతలు అప్పగించింది.

నాడు కిరణ్ తో జగన్ కు చెక్ పెట్టాలని...

నాడు కిరణ్ తో జగన్ కు చెక్ పెట్టాలని...

జగన్ కాంగ్రెస్ ను చీలుస్తారనే భయంతో రాయలసీమకు చెందిన జగన్ ను అదే ప్రాంతానికి చెందిన-అదే వర్గానికి చెందిన నేతతో చెక్ పెట్టాలని డిసైడ్ అయింది. కిరణ్ సీఎం కాగానే...జగన్ బాబాయ్ వివేకాను కేబినెట్ లోకి తీసుకున్నారు. దీంతో..తమ కుటుంబలోనే విభేదాలు తీసుకురావటం జగన్ కు నచ్చలేదు. వెంటనే పార్టీకి రాజీనామా చేసి..కొత్త పార్టీ పెట్టారు. కడప ఎంపీగా జగన్..పులివెందుల ఎమ్మెల్యేగా విజయమ్మ పోటీ చేసారు. రికార్డు మెజార్టీతో జగన్ గెలిచారు. అంతే, ఆ టైం లో సీఎంగా ఉన్న కిరణ్ తో ఎలాగైనా జగన్ ను కంట్రోల్ చేయాలని..పార్టీకి నష్టం లేకుండా చూడాలని హైకమాండ్ సూచించింది.

కిరణ్ సీఎంగా ఉండగా జగన్ అరెస్ట్..

కిరణ్ సీఎంగా ఉండగా జగన్ అరెస్ట్..

ఫలితంగా కేసుల పేరుతో సీబీఐ విచారణ మొదలైంది. జగన్ అరెస్ట్ అయ్యారు. దీంతో..ఇక జగన్ పెట్టిన పార్టీకి భవిష్యత్ ఉండదని కాంగ్రెస్ తో సహా..కిరణ్ సైతం భావించారు. కానీ, విజయమ్మ- షర్మిల గ్రౌండ్ లోకి వచ్చారు. అప్పుడు కిరణ్ ప్రభుత్వం మీద ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం కు వ్యతిరేకంగా టీడీపీ నిర్ణయించింది. అయినా..విప్ ఉల్లంఘించిన కాంగ్రెస్ - టీడీపీ ఎమ్మెల్యేల పైన వేటు పడింది. ఫలితంగా ఉప ఎన్నికలు వచ్చాయి. జగన్ జైలులోనే ఉన్నారు. ఆ సమయంలో కిరణ్ ఎలాగైనా జగన్ పార్టీని ఓడించాలని సీఎం స్థాయిలో శతవిధాలా ప్రయత్నించారు. చివరకు కాంగ్రెస్ కు రెండు సీట్లు మాత్రమే దక్కాయి. అన్నీ..జగన్ పార్టీ గెలుచుకుంది.

2014 ఎన్నికల్లో జగన్ అసెంబ్లీకి..కిరణ్ పోటీకి దూరంగా..

2014 ఎన్నికల్లో జగన్ అసెంబ్లీకి..కిరణ్ పోటీకి దూరంగా..


ఇక, రాష్ట్ర విభజన సమయంలో కిరణ్ సమైక్యాంధ్ర నినాదంతో కొత్త పార్టీ పెట్టి...పోటీ చేసారు. అవే 2014 ఎన్నికల్లో టీడీపీ-పవన్-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. జగన్ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఇక, ఇప్పుడు జగన్ సీఎం స్థానంలో ఉన్నారు. కాంగ్రెస్ ను వీడిన కిరణ్ తిరిగి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరారు. రాహుల్ తో జరిగిన కీలక సమావేశంలో పాల్గొన్నారు. జగన్ వైపు వెళ్లిన కాంగ్రెస్ సాంప్రదాయ ఓట్ బ్యాంకు ను తిరిగి దక్కించుకోవాలంటే ఏం చేయాలో ఒక నివేదిక అందించారని సమాచారం. పార్టీ నుంచి వెళ్లిన వారిని తిరిగి తీసుకొస్తానంటూ కిరణ్ చెప్పినట్లుగా ప్రచారం సాగింది.

ఏపీ పీసీసీ చీఫ్ గా కిరణ్ వైపు చూపు..

ఏపీ పీసీసీ చీఫ్ గా కిరణ్ వైపు చూపు..


ఇక, ఇప్పుడు తెలంగాణలో రేవంత్ తరహలో ఏపీలోనూ కొత్తగా పీసీసీ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే చర్చ సాగుతోంది. ఇందులో భాగంగా మాజీ సీఎం కిరణ్ పేరు ఫైనల్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. కిరణ్ సోదరుడు కిషోర్ ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. కిరణ్ కాంగ్రెస్ లో ఉన్నా..యాక్టివ్ రోల్ లో లేరు. కానీ, ఆయనకు పీసీసీ ఇస్తారనే ప్రచారం ఢిల్లీ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో చీఫ్ విప్ గా కిరణ్ కు జగన్ కు సంబంధించిన అన్ని అంశాల మీద అవగాహన ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.

జగన్ హవాను అడ్డుకోవటం కిరణ్ కు సాధ్యమేనా..

జగన్ హవాను అడ్డుకోవటం కిరణ్ కు సాధ్యమేనా..

నాడు పరిటాల రవి హత్య కేసులో జగన్ పైన టీడీపీ నేతలు శాసనసభలో విమర్శలు చేయగా..వాటిని కిరణ్ తిప్పి కొట్టిన అంశాన్ని వారు గుర్తు చేస్తున్నారు. దీంతో..ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ ను ఎదుర్కోవాలంటే కిరణ్ కే బాధ్యతలు అప్పగిస్తారని కాంగ్రెస్ లో జరుగుతున్న చర్చ. అయితే, ఇప్పుడు జగన్ సీఎం స్థానంలో ఉన్నారు. బలమైన నేతగా ఎదిగారు. జగన్ ను తొలి నుంచి రాజకీయంగా దెబ్బ తీయటానికి కిరణ్ ప్రయత్నించారనేది వైసీపీ నేతల ఆరోపణ.


కానీ, ఇప్పుడు కిరణ్ పీసీసీ చీఫ్ అయినా... ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం.. జగన్ కు నష్టం చేయటం ఇవన్నీ సాధ్యం అయ్యేవీ కావని వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. అది కిరణ్ టైం అని...ఇప్పుడు జగన్ టైం అంటూ వారు వ్యాఖ్యానిస్తున్నారు.

English summary
AICC leaders may appoint ex CM Kiran Kumar Reddy as PCC Chief to face Jagan in AP politics. But, YSRCP leaders confident on congress will not gain in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X