తమిళ స్టార్ హీరోతో తెలుగు హీరోయిన్ ఎఫైర్?
అనేక తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సంఘవి తెలుగులోనే కాకుండా దక్షిణాదిలోని పలు భాషల్లో సినిమాలు చేసింది. సంఘవి పేరు చెప్పగానే తాజ్ మహల్, సింధూరం, సమరసింహారెడ్డి, సూర్యవంశం లాంటి సూపర్ హిట్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. దక్షిణాదిలోని చాలామంది స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాన్ని దక్కించుకుంది. తమిళంలో స్టార్ హీరో దళపతి విజయ్ తో కూడా నటించింది. అప్పట్లో వీరిద్దరి మధ్య సినిమాల్లో ఇంటిమేట్ సన్నివేశాలు ఎక్కువగా ఉండేవి. వీటినిచూసి విజయ్, సంఘవి మధ్య ఎఫైర్ నడుస్తోందంటూ పెద్ద సంఖ్యలో వార్తలు వచ్చాయి.
చొక్కా విప్పేసి నీళ్లల్లోకి దిగాడు
తొలిసారిగా వీరిద్దరూ కలిసి రసిగన్ అనే చిత్రంలో నటించారు. విజయ్ తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్ దీనికి దర్శకత్వం వహించారు. ఓ పాట షూటింగ్ సమయంలో ఆసక్తికర సంఘటన జరిగిందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో సంఘవి తెలిపింది. ఒక కొలనులో విజయ్, సంఘవి రొమాన్స్ చేయాల్సి ఉంది. అయితే ఆ సమయంలో చలి ఎక్కువగా ఉంది. సినిమాలో నటించేందుకు విజయ్ చొక్కా విప్పేసి నీళ్లలోకి దిగాడుకానీ ఆ చలిని భరించలేక వణికిపోతున్నాడు. సంఘవి మాత్రం ఆ చలికి తట్టుకోగలిగింది. చలివల్ల విజయ్ రొమాంటిక్ సన్నివేశంలో సరిగా నటించలేకపోతున్నాడు. దీంతో చాలా టేకులు అవసరమయ్యాయి. విజయ్ తండ్రి చంద్రశేఖర్ కు కోపం వచ్చింది.

ఎందుకు వణికిపోతున్నావ్..
ఆ అమ్మాయి అంత బాగా చేస్తోంటే నువ్వేంటి వణికిపోతున్నావ్ అంటూ తిట్టాడు. తండ్రీ కొడుకుల మధ్య జరిగిన ఆ చిన్న గొడవ భలే సరదాగా అనిపించింది అని సంఘవి చెప్పింది. విజయ్ తో ఆమె మూడు సినిమాలు చేసింది. ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ రూమర్లు వచ్చాయి. నాలుగో సినిమాకు కూడా సంఘవిని తీసుకున్నారుకానీ రూమర్లు ఎక్కువవుతుండటంతో ఆమెను చంద్రశేఖర్ పక్కన పెట్టారు. ప్రస్తుతం గోట్ చిత్రం చేస్తున్న విజయ్ మరో సినిమా చేసి పరిశ్రమకు గుడ్ బై చెప్పనున్నారు. రాజకీయ పార్టీ స్థాపించారు. ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోతున్నారు.












Click it and Unblock the Notifications