లారీ ఢీకొని మాజీ సైనికుడు మృతి, మరో ఇద్దరి మృతి
చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని కుప్పం - కృష్ణగిరి జాతీయ రహదారిలో నడిమూరు వద్ద లారీ ఢీకొని మాజీ సైనికుడు మృతి చెందాడు. కూర్మాయిపల్లి గ్రామానికి చెందిన సెల్వరాజు (55) అనే మాజీ సైనికుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వెనకు నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో సెల్వరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి చేర్పించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

ఇంటిపైకప్పు కూలి ఇద్దరి మృతి
విజయవాడలోని విద్యాధరపురంలో నిర్మాణంలో ఉన్న ఇంటిపైకప్పు కూలి ఇద్దరు మృతి చెందారు. ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మరో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికత్సను అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications