ఒకరోజు బతికినా మగాడిలా బతకాలి: అనిల్ కుమార్ యాదవ్

ఒక మాజీ మంత్రిగా అసభ్య పదజాలాన్ని ఉపయోగించేవారిలో అనిల్ కుమార్ యాదవ్ కూడా ఒకరు. అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే ఆ 41 రోజులు దీక్ష చేపడతారు కాబట్టి, అప్పుడు వ్యవహరించే విధానం, ఆధ్యాత్మికత, మంచి నడవడిక, మృదువైన సంభాషణల్లాంటి అలవడతాయని గురుస్వాములు చెబుతారు. కానీ మాజీ మంత్రి అనిల్ మరోసారి జర్నలిస్టులను ఉద్దేశించి నా వెంట్రుక కూడా పీకలేరు అని వ్యాఖ్యానించారు.

ఆదివారం, ఆదివారం బొమ్మిడాయిల పులుసు తీసుకొచ్చి ఇస్తే చాలు, తనపై వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని, అలాంటివారికి, వారివెనక ఉన్నవారికి తాను భయపడనని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విలేకరులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నెల్లూరు నగరంలో అభివృద్ధి లేదని కొంతమంది జర్నలిస్టులు రాస్తున్నారని, వారు తన వెంట్రుక కూడా పీకలేరన్నారు. తన వెనక ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని, పది సంవత్సరాల నుంచి తనను పొడుస్తున్నప్పటికీ భయపడేది లేదన్నారు. ఒకరోజు బతికినా మగాడిలా బతకాలని, ప్యాకేజీలు తీసుకొని వార్తలు రాసేవారికి తాను భయపడనని, ఏం పీక్కుంటారో పీక్కోండని సవాల్ విసిరారు.

 ex minister anil kumar yadav comments on journalists

నెల్లూరు నగరంలో అనిల్ కుమార్ యాదవ్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటిదగ్గర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నారు. వైఎస్ జగన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రక్తదానం చేసిన పార్టీ కార్యకర్తలందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. మరోసారి వైసీపీ ప్రభుత్వం రావడం ఖాయమని, ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, రానివారందరినీ వాలంటీర్లు తెలుసుకొని మరీ అందజేస్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+