ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమైన బాలినేని

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డితో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సమావేశమయ్యారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తనకు సరైన ప్రాతినిధ్యం లభించడం లేదంటూ బాలినేని కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్నారు. ఇటీవలే నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త పదవికి కూడా ఆయన రాజీనామా సమర్పించారు. రాజీనామా చేసిన తర్వాత తాడేపల్లికి రావాలంటూ కబురు పంపించినా స్పందించలేదు.

హైదరాబాద్ లో బాలినేని:మూడు రోజుల నుంచి బాలినేని హైదరాబాద్ లోనే ఉన్నారు. పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నారంటూ బాలినేని అనుచరుల నుంచి వార్తలు రావడంతో ముఖ్యమంత్రి జగన్ ఆయన్ను తాడేపల్లికి పిలిపించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీలో తన అసంతృప్తికి గల కారణాలను ఆయన వివరించినట్లు సమాచారం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో, పార్టీలో తన ప్రాధాన్యత తగ్గించే విధంగా ఎవరు పనిచేస్తున్నారనే విషయంపై ఆయన జగన్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

ex minister balineni srinivasa reddy meet cm ys jaganmohan reddy

ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జిల ఫిర్యాదు:తమ వ్యతిరేక వర్గాలను ప్రోత్సహిస్తున్నారంటూ పలువురు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జిలు ముఖ్యమంత్రి జగన్ కు బాలినేనిపై ఫిర్యాదు చేశారు. తమను పట్టించుకోకుండా వర్గవిభేదాలను ప్రోత్సహిస్తున్నారంటూ అధిష్టానం దృష్టికి తెచ్చారు. వీటిపై ముఖ్యమంత్రి జగన్ బాలినేనిని వివరణ అడిగినట్లు సమాచారం. పార్టీలో మొదటి నుంచి ఎంతో కీలకంగా వ్యవహరించిన బాలినేని పార్టీ పదవుల నుంచి తప్పుకోవడంపై వైసీపీ అధిష్టానం అసంతృప్తితో ఉంది. శ్రీనివాసరెడ్డిని బుజ్జగించి మళ్లీ తిరుపతి, నెల్లూరు, కడప జిల్లాల సమన్వయకర్తగా బాధ్యతలు తీసుకునేలా చూస్తున్నారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ సమయంలో బాలినేని తన మంత్రి పదవిని కోల్పోయారు. తాజాగా వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త పదవికి రాజీనామా సమర్పించారు. పార్టీపై అలక కారణంగానే రాజీనామా చేశారంటూ బాలినేని అనుచరులు చెబుతున్నారు. ఐదు కోట్ల వ్యవహారం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+