టికెట్ అడిగేస్థాయి కాదు మాది... 10 మందికీ ఇచ్చే స్థాయి!?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇటీవలే కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఆ పర్యటనలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియకానీ, భూమా బ్రహ్మానందరెడ్డికానీ కనిపించలేదు. ఇతర నేతలంతా చివరకు మూడున్నర సంవత్సరాల నుంచి పార్టీకి దూరంగా ఉంటున్న కేఈ సోదరులు కూడా కనిపించారు. చంద్రబాబు నిర్వహింపచేసుకున్న సర్వేలో ఆళ్లగడ్డలో, నంద్యాలలో పార్టీ పరిస్థితి మెరుగుపడినప్పటికీ అభ్యర్థుల వల్ల ప్రత్యర్థి పార్టీకే అవకాశం ఉంటుందని తేలింది.

అఖిలప్రియకు సీటివ్వడం డౌటే!
దీంతో చంద్రబాబు రానున్న ఎన్నికల్లో భూమా అఖిలప్రియకు సీటిచ్చేది అనుమానమేనని పార్టీ కేంద్ర కార్యాలయవర్గాలు వెల్లడించాయి. అఖిలప్రియ బంధువు భూమా కిషోర్ రెడ్డి నియోజకవర్గంలో భారతీయ జనతాపార్టీ నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. వ్యక్తిగతంగా ఆయనకు మైలేజ్ వస్తోంది. అఖిలప్రియకు బదులుగా కిషోర్ రెడ్డిని పార్టీలోకి తీసుకొని టికెట్ కేటాయించే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు నంద్యాలో భూమా బ్రహ్మానందరెడ్డి కూడా బలోపేతం కాలేదని తేలింది.

అభ్యర్థుల బలాబలాలను బట్టే విజయాలు..
అభ్యర్థుల బలాబలాలను బట్టి పార్టీల విజయావకాశాలు ఆధారపడివుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకున్న బాబు మాజీ మంత్రికి దాదాపుగా చేయిచ్చినట్లుగా భావించవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా ఇటీవల తమది టికెట్ అడిగే స్థాయి కాదని.. 10 మందికి టికెట్ ఇచ్చే స్థాయి అని అఖిలప్రియ వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. ఈ వార్తను కొందరు నాయకులు అధినేతకు చేరవేశారు. అంతేకాకుండా ఇటీవల అఖిలప్రియ చంద్రబాబును కలవడానికి వచ్చిన సమయంలో అనుకున్నస్థాయిలో టికెట్ పై హామీ లభించలేదని తెలుస్తోంది. తర్వాత ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిల సమావేశం ఏర్పాటుచేస్తే దానికి ఆమె గైర్హాజరయ్యారు.

పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ..
పరిస్థితులు తనకు వ్యతిరేకంగా ఉంటున్నప్పటికీ ఆళ్లగడ్డలో తనకు, నంద్యాలలో తన తమ్ముడు విఖ్యాత్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ తరఫున సీట్లకోసం ఆమె ప్రయత్నాలు ఆమె చేస్తున్నారు. చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ లభించలేదని సమాచారం. అఖిలప్రియ ఇటీవలి కాలంలో వివాదాస్పదంగా మారారు. దీనివల్ల నియోజకవర్గంలో ఆమె పార్టీపై దృష్టిసారించలేదు. అదే ఆమెకు మైనస్ గా మారింది. భూమా కిషోర్ రెడ్డిని త్వరలోనే తెలుగుదేశంపార్టీలోకి తీసుకొని టికెట్ కేటాయిస్తారని తెలుస్తోంది.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications