మంత్రి ఏ కలుగులో దాక్కున్నారో?
ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏ1 నిందితుడిగా ఉన్నారని, ఆయన భార్య ఏ2గా ఉన్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి కేఎస్ జవహర్ విమర్శలు గుప్పించారు. సురేష్ తండ్రి దళితుల ఆత్మగౌరవం కోసం గుర్రాలపై తిరిగితే.. కొడుకు అదే ఆత్మగౌరవాన్ని ముఖ్యమంత్రి జగన్ కు తాకట్టుపెట్టడానికి బట్టలిప్పి తిరిగారని మండిపడ్డారు. నడిరోడ్డుపై బట్టలు విప్పేయడంవల్ల దళిత జాతిని జగన్ కాళ్ల దగ్గర తాకట్టుపెట్టారన్నారు.
సురేష్ వెంటనే తన తప్పును ఒప్పుకొని దళితులకు క్షమాపణ చెప్పాలని జవహర్ డిమాండ్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు చూపించే జగన్ సురేష్ తో అర్థనగ్న ప్రదర్శన చేయించారన్నారు. బట్టల్లేకుండా నడివీధుల్లో తిరిగి ఆదిమూలపు సురేష్ తన చర్యలతో దళితుల ఆత్మగౌరవాన్ని అపహాస్యం చేశారన్నారు. జగన్ అంటే భయంవల్ల చొక్కాలు విప్పారా? లేదంటే ఆస్తులపైకి సీబీఐ వస్తుందన్న భయమా? అని ప్రశ్నించారు.

ఆదిములపు సురేష్ సీఎం జగన్‌కు విశ్వాసపాత్రుడేకానీ మాదిగలకు కాదన్నారు. విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక మాఫియాపై ప్రశ్నించిన వరప్రసాద్ అనే యువకుడికి శిరోముండనం జరిగినప్పుడు సురేష్ చొక్కా విప్పితే దళితజాతి హర్షించేదని, అప్పుడు సురేష్ ఎక్కడున్నారన్నారు. డాక్టర్ సుధాకర్ మొదలు డాక్టర్ అచ్చెన్న వరకు ఎందరో దళితుల్ని జగన్ బలి తీసుకుంటే సురేష్ నోరు ఎత్తివుంటే బాగుండేదన్నారు. మాదిగజాతికి తలవంపులు తెచ్చేలా వ్యవహరించారన్నారు. అసలు దళితుల కోసం సురేష్ ఏనాడైనా పోరాడాడా? అని ప్రశ్నించారు. వరప్రసాద్‌కు శిరోముండనం చేసినప్పుడు ఆదిమూలపు సురేష్ ఏ కలుగులో దాక్కున్నారని జవహర్ నిలదీశారు. నీ ప్రాంతంలో దళితులకు నీవేం చేశావో చెప్పాలని, చంద్రబాబునాయుడు దళిత బాంధవుడని, ఆయన్ను విమర్శించే అర్హత మంత్రికి లేదన్నారు. రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతుంటే కనీసం పట్టించుకోని మంత్రికి ఆ దళితుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.












Click it and Unblock the Notifications