తన భూమినే మార్చేశారంటూ రెవెన్యూ అధికారులపై ఫైర్ అయిన మాజీ మంత్రి పరిటాల సునీత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీపై అధికార వైసిపి కక్ష సాధింపులకు పాల్పడుతోందని పదేపదే టిడిపి నేతలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఇక వైసీపీ ప్రభుత్వానికి తగ్గట్టుగా అధికారుల తీరు ఉందని కూడా తీవ్ర అసహనం వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉంది. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత తన భూమిని మార్చేశారు అంటూ రెవెన్యూ అధికారుల పై ఫైర్ అయ్యారు.
అధికార ఒత్తిళ్లకు తలొగ్గి రెవెన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడిన పరిటాల సునీత అలాంటి వారు తమ పనితీరు మార్చుకోవాలని హితవు పలికారు. రెవెన్యూ అధికారులు తమ నియోజకవర్గంలో భూ దస్త్రాలు, ఆన్లైన్ లో వివరాలను కూడా తారుమారు చేస్తున్నారని పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. కనగానపల్లి మండలంలో తన పేరు మీద ఉన్న పట్టా భూమిని వేరొకరి పేరు మీద మార్చారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని పరిటాల సునీత రెవెన్యూ అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తంగా రెవెన్యూ అధికారులు అధికార పార్టీ నాయకులకు వంత పాడుతూ రెవెన్యూ రికార్డులను గోల్ మాల్ చేస్తున్నారని మండిపడ్డారు. ఒక మాజీ మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసిన తన భూమిని మార్చారంటే సామాన్యుల పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని పరిటాల సునీత పేర్కొన్నారు. అన్ని రికార్డులు సక్రమంగా ఉండి సాగుచేసుకుంటున్న రైతులకు అన్యాయం చేయవద్దని విజ్ఞప్తి చేసిన పరిటాల సునీత, రెవెన్యూ అధికారుల తీరు మార్చుకోవాలని హితవు పలికారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications