విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌ది కన్నింగ్ మైండ్ ?.. కేంద్రం తలచుకుంటే "రాజధానిగా అమరావతి" ప్రకటన : ప్రత్తిపాటి

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేతలు మరోసారి విరుచుకుపడ్డారు. వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలపై కేసులు పెట్టడం, కక్ష సాధింపులకు పాల్పడడం తప్ప చేసిందేమి లేదని దుయ్యబట్టారు. జగన్ పాలనను ప్రజలు చీదరించుకుంటున్నారని మండిపడ్డారు

ముగిసిన అమరావతి రైతుల దీక్ష

ముగిసిన అమరావతి రైతుల దీక్ష

ఏపీ రాజధానిగా అమరావతి ఉండాలని ప్రారంభించి ఉద్యమం 800 రోజులకు చేరింది. ఈ సందర్బంగా అమరావతి రైతులు చేపట్టిన 24 గంటల దీక్షముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి టీడీపీ, జనసేన, కాంగ్రెస్, లెప్ట్ పార్టీల నేతలు హాజరై వారికి సంఘీభావం తెలిపారు. రైతులకు నిమ్మరసం ఇచ్చి.. వారితో దీక్షను విరమింపజేశారు.

అమరావతినే రాజధానిగా ప్రకటించేవరకు తమ పోరాటం కొనసాగుతుందని రైతులు స్పష్టం చేశారు. మళ్లీ మూడు రాజధానుల బిల్లును తీసుకురావాలని చూస్తే తమ ఉద్యమం తీవ్రరూపం దాల్చుతుందని హెచ్చరించారు.

వైసీపీ క‌న్నింగ్ పాలిటిక్స్..

వైసీపీ క‌న్నింగ్ పాలిటిక్స్..

ఈ సందర్భంగా మాజీ మంత్రి , టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు జగన్ ప్రభుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. గత ఎన్నికల్లో జగన్‌కు ఓటేసిన జనం ఇప్పుడు బాధపడుతున్నారని పేర్కొన్నారు. కేంద్రంలో వైసీపీ కన్నింగ్ పాలిటిక్స్ చేసుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తలచుకుంటే రాజధానిగా అమరావతి ప్రకటన వస్తుందని ప్రత్తిపాటి పేర్కొన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న స్వార్థపూరిత కుట్రలకు సామాన్యులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల స్పందన చూసైనా సీఎం జగన్ లో మార్పు రావాలని హితవు పలికారు.

న‌య వంచ‌కు జ‌గ‌న్ మారుపేరు..

న‌య వంచ‌కు జ‌గ‌న్ మారుపేరు..

అమరావతి నిర్మాణాన్ని ఆపేసిన సీఎం జగన్ కి ఇక్కడి భూములను తాకట్టు పెట్టే హక్కు ఎవరిచ్చారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర నిలదీశారు. నయ వంచనకు సీఎం జగన్ మారుపేరని .. ఇది అమరావతి విషయంలో నిరూపితమైందని విమర్శించారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అమరావతి రైతుల ఉసురు సీఎం జగన్‌కు తప్పక తగులు తుందని విమర్శించారు.

English summary
TDP Leaders Pratipati, dulipala fire on cm jagan over Amaravati Issue..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X