ఆ పని చేయకుంటే కూటమి ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోమన్న రోజా

మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్కే రోజా కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. నేడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించిన రోజా కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఏమీ చేయటం లేదన్నారు రోజా. ప్రజలకు మంచి చేయలేని నాయకులు రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలని ఆమె ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.

ప్రసిద్ధ ఆలయాల ప్రతిష్టను కూటమి నేతలు దెబ్బ తీస్తున్నారు: మాజీమంత్రి రోజా

రాష్ట్రంలోని తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీశైలం, అన్నవరం సత్యనారాయణస్వామి వంటి ప్రసిద్ధ ఆలయాల ప్రతిష్టను కూటమి నేతలు దెబ్బ తీస్తున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. లడ్డూ వ్యవహారంలో తప్పు లేదని భావిస్తే, చర్చకు రావాలని ఆమె సవాలు చేశారు. కావాలని లడ్డూ వ్యవహారంలో రాద్దాంతం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

Ex minister R K Roja strongly criticized ap ministers demand to resign if they can t serve people

చంద్రబాబు, పవన్ తో సహా అందరూ దిగజారుడు వ్యాఖ్యలు

తాను అనేకసార్లు చెప్పినా, కొందరు నేతలు దేవుడిని రాజకీయాల్లోకి లాగుతున్నారని మాజీమంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ నివేదిక ద్వారా జంతుకొవ్వు కలిసిందనే ఆరోపణలు పచ్చి అబద్ధమని తేలిందని ఆమె స్పష్టం చేశారు. అయినా సరే దీనిని తప్పు దారి పట్టిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, హోంమంత్రి అనిత వంటి ఉన్నత నాయకులు సైతం దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు.

శాసన మండలి చైర్మన్‌ కులం, మతం గురించి మాట్లాడటం హేయమైన చర్య

ఈ పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. శాసన మండలి చైర్మన్‌ కులం, మతం గురించి మాట్లాడటం హేయమైన చర్య అని ఆమె విమర్శించారు.ఈ అంశాన్ని దారి మళ్లించడానికి కుల ప్రస్తావన తీసుకురావడం తగదని ఆమె అభిప్రాయపడ్డారు. నాయకులు కుల, మత వివక్ష లేకుండా తమ బాధ్యతలను నిర్వర్తించాలని రోజా సూచించారు. మంత్రి అచ్చెన్నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రోజా, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన మంత్రి సరైన విధంగా మాట్లాడలేదని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+