జగన్‌కి బిగ్ బూస్ట్.. వైసీపీలోకి కీలక నేత ఎంట్రీ..?
ఓడలు బండ్లు అవుతాయ్, బండ్లు ఓడలు అవుతాయ్ అంటే ఏంటో అనుకుంటాము. కానీ వైసీపీని చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. ఆ పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా ప్రజల్లో ఉన్న జగన్, గత ఎన్నికల్లో దారుణ ఓటమిని మూటగట్టుకున్నారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో 15 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 12 గెలుపుకుని చరిత్ర సృష్టించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో 151 సీట్లలో ఘన విజయం సాధించారు. కట్ చేస్తే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేవలం 11 స్థానాల్లో మాత్రమే గెలిచి ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది.
పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామంది వైసీపీ నేతలు పార్టీకి రాజీనామా చేశారు.మాజీ మంత్రులు సైతం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వైసీపీ నుంచి వెళ్లే నేతలే కనిపిస్తున్నారు తప్పిస్తే.. వైసీపీలోకి వచ్చే నేతలు ఎవరూ కూడా కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలో ఓ సీనియర్ నేత వైసీపీ వైపు చూస్తున్నారనే వార్త ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ నేత మరెవ్వరో కాదు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్. తాజాగా ఆయన కర్నూల్‌లో జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో జగన్‌ను కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సైతం బయటకు రావడం జరిగింది. దీంతో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి.

2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ బాధ్యతల నుంచి తప్పుకున్న శైలజానాథ్, ఆ తర్వాత పెద్దగా యాక్టివ్ పొలిటిక్స్ చేయడం లేదు. గత ఎన్నికల్లో సైతం ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. ఇదే సమయంలో ఆయన షర్మిల తీరుపై కూడా గుర్రగా ఉన్నారని సమాచారం. దీని కారణంగానే శైలజానాథ్ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఆయన తిరిగి యాక్టివ్ పొలిటిక్స్ చేయాలని చూస్తున్నారు. దీనిలో భాగంగానే శైలజానాథ్ వైసీపీలో చేరాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఆయన వైసీపీలో చేరతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలోనే కర్నూల్‌లో జగన్‌తో శైలజానాథ్ భేటీ అయినట్టు తెలుస్తోంది.
శైలజానాధ్ దివంగత సీఎం వైఎస్ఆర్ హయంలో మంత్రిగా ఓ వెలుగు వెలిగారు. ముఖ్యంగా రాజశేఖరరెడ్డి అనుచరుడుగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. శైలజానాధ్ గతంలో శింగనమల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు.వైసీపీకి సైతం ఇక్కడ పంచి పట్టుంది. 2014,2019 వరుస ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో జొన్నలగడ్డ పద్మావతికి టికెట్ ఇస్తే వైసీపీ నుంచి ఆమె ఎమ్మెల్యే అయ్యారు. అయితే 2024లో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత ఉందని భావించి జగన్ ఇక్కడ కొత్త ప్రయోగం చేశారు.
రాజకీయాలకు కొత్త అయిన టిప్పర్ డ్రైవర్‌కి టికెట్ ఇచ్చి గెలిపిద్దామనుకున్నారు. కానీ కూటమి అభ్యర్థి ఇక్కడ నుంచి విజయం సాధించారు. ఇప్పుడు శైలజానాధ్ వైసీపీలో చేరితే , శింగనమల నియోజకవర్గం బాధ్యతలను ఆయనకు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి నెలలో శైలజానాధ్ వైసీపీ తీర్ధం పుచ్చుకుంటారని తెలుస్తోంది.ఇదే కనుక జరిగితే శింగనమల నియోజకవర్గంలో ఫ్యాన్ జోరు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications