కడప నుంచి హైదరాబాద్ చేరుకున్న 3 ట్రంకు పెట్టెలు!
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించిన ఫైల్స్ ను హైదరాబాద్ ప్రిన్సిపల్ సీబీఐ కోర్టుకు తరలించారు. సాక్షుల వాంగ్మూలాలు, ఆధారాలు, ఛార్జిషీట్లు, ఇతర ఫైల్స్ 3 ట్రంకు పెట్టెల్లో కడప జిల్లా సెషన్స్‌కోర్టు నుంచి హైదరాబాద్ సీబీఐ కోర్టుకు తీసుకువచ్చారు.
ఢిల్లీ సీబీఐ విభాగం వివేకా హత్యకేసును దర్యాప్తు చేస్తోంది. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్, దస్తగిరిపై ప్రధాన ఛార్జిషీట్, దేవిరెడ్డి శంకర్‌రెడ్డిపై అనుబంధ ఛార్జిషీట్‌ను సీబీఐ కడప జిల్లా సెషన్స్ కోర్టులో గతంలోనే దాఖలు చేసింది. అయితే కేసు విచారణ ఆంధ్రప్రదేశ్ నుంచి బదిలీ చేయాలన్న వైఎస్ వివేకా కుమార్తె సునీత అభ్యర్థన మేరకు.. తెలంగాణకు బదిలీ చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఫైళ్లన్నీ సుప్రీంకోర్టు ఆదేశాలతో హైదరాబాద్ సీబీఐ కోర్టుకు దర్యాప్తు సంస్థ తరలించింది. ఛార్జిషీట్లు పరిశీలించాలని న్యాయస్థానం కోర్టు కార్యాలయాన్ని ఆదేశించింది. కోర్టు పరిశీలించి ఛార్జిషీట్‌కు నంబరు కేటాయించిన తర్వాత హైదరాబాద్‌లో విచారణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

రెండురోజులుగా సీబీఐ అధికారులు కేసు దర్యాప్తులో ఉన్నారు. ఒకసారి కడప ఎంపీ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి కోసం ఇంటికి వెళ్లగా అక్కడ లేకపోవడంతో వైసీపీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కూడా లేకపోవడంతో అవినాష్ రెడ్డి పీఏ రాగా అతని ఫోన్ లో మాట్లాడి కొన్ని వివరాలు సేకరించారు. విచారణకు హాజరుకావాలంటూ అవినాష్ రెడ్డికి నోటీసును జారీచేశారు. ముందుగానే నిర్ణయించుకున్న కార్యక్రమాలుండటంతో ఐదు రోజుల తర్వాత హాజరవుతానని అవినాష్ రెడ్డి సీబీఐకి సమాచారమందించారు. పులివెందులకు అదనపు భద్రతా బలగాలను పంపించాలన్న సీబీఐ కోరిక మేరకు జిల్లా ఎస్పీ బలగాలను తరలించారు.












Click it and Unblock the Notifications