పోలీసులకు సిగ్గుండాలి.. వైసీపీ నేత తోపుదుర్తి షాకింగ్ కామెంట్స్
వైసీపీ నేత, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఓ వైపు టీడీపీలోని పరిటాల ఫ్యామిలీతో వైరల్ నడుస్తుండగా.. ఇప్పుడు సొంత పార్టీలోనే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తో ఆధిపత్య పోరు హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏకంగా పోలీసులపై తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.
నియోజకవర్గంలోని కనగానపల్లి మండలం గుంతపల్లిలో వైసీపీ కార్యకర్తపై కత్తితో దాడి చేసిన ఘటనపై విచారణ వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఘాటైన విమర్శలు చేశాడు. పరిటాల కుటుంబానికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. పోలీసులకు సిగ్గుండాలని, పోలీసులు పరిటాల కుటుంబం గుమస్తాలు, వాచ్‌మెన్‌లు కాదని విమర్శించారు.

పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ వర్గీయులే వైసీపీ కార్యకర్త చాకలి నరసింహులుపై దాడి చేయించారని ఫైర్ అయ్యారు. వైసీపీ కార్యకర్తపైనే దాడి చేసి.. తిరిగి వైసీపీ కార్యకర్త పైనే అక్రమంగా కేసు నమోదు చేశారని మండిపడ్డారు. అయితే పాత కక్షల నేపథ్యంలో చాకలి నరసింహులుపై దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మరోవైపు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, గోరంట్ల మాధవ్ మధ్య వివాదం ముదురుతోంది. రాప్తాడు నియోజకవర్గంలో గోరంట్ల మాధవ్ యాక్టివ్‌గా తిరగడంపై ప్రకాష్ రెడ్డి వర్గీయులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీలో కొందరు నేతలు తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని తోపుదుర్తి అధిష్టానికి ఫిర్యాదు చేశారు. వారిపై వేటు వేయకుంటే పార్టీకి కష్టాలు తప్పవని ప్రస్తావించారట. దీంతో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కి చెందిన కొందరు అనుచరులపై వేటు వేసింది.
దీంతో ఆగ్రహించిన రామగిరికి చెందిన మండల నాయకులు.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యతిరేకిస్తూ రాజీనామాలు చేస్తామంటూ పోస్టులు పెట్టడం కలకలం రేపింది. తన వర్గానికి చెందిన కొందరు నేతలపై పార్టీ వేటు వేయడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. ఇలా అయితే పార్టీ మనుగడ కష్టమనే అభిప్రాయాన్ని సహచరుల వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. మరి రానున్న ఈరోజుల్లో ఈ వ్యవహరం ఇంకెంత ముదురుతుందో అని చర్చ జరుగుతోంది. మరి అసంతృప్త నేతలు వైసీపీ లోనే కొనసాగుతారా.. లేక మరో పార్టీలోకి మారతారా అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications