చెక్ బౌన్స్ కేసు: మాజీ ఎమ్మెల్యేకి ఏడాది జైలు శిక్ష
హైదరాబాద్: కర్నూలు జిల్లా నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామికి చెక్ బౌన్స్ కేసులో ఏడాది పాటు జైలు శిక్ష పడింది. హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈ శుక్రవారం తీర్పునిచ్చింది.
ఆయనతో పాటు జంగం గోపి, రమేష్ బండారికి కూడా కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. మెదక్ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి వెంకటస్వామి ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో కేసు నమోదైంది.

దీనిపై గత ఆరేళ్లుగా కోర్టులో కేసు నడుస్తోంది. బండారి కన్‌స్ట్రక్షన్స్ కంపెనీపై ఎస్ ఇబ్రహీం అనే వ్యక్తి వేసిన కేసులో తనను ప్రతివాదిగా చేర్చారంటూ లబ్బి వెంకటస్వామి గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications