సీఎం జగన్ గట్స్ కు హాట్యాఫ్: తాత రాజారెడ్డి మార్క్‌ పాలన సాగిస్తున్నారు: జేసీ దివాకర్ రెడ్డి

తరచూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి జగన పైన సెటైర్లు వేసారు. జగన్ హయాంలో హయాంలో తాత రాజారెడ్డి మార్క్‌ పాలన సాగుతోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో కమ్మవాళ్లు కృష్ణా, గోదావరిలో కలిసిపోయారని.. నామినేటెడ్‌ పోస్టులు రెడ్లకు ఇచ్చినందుకు జగన్‌ను అభినందిస్తున్నానన్నారు. జగన్ గట్స్ ను మెచ్చుకుంటున్నానని..అయితే చంద్రబాబుకు ఆ ధైర్యం లేదని విమర్శించారు. ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అని సినిమా పేరు పెట్టటం పైనా స్పందించారు. ఇప్పుడు జేసీ చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీ లాబీల్లో హాట్ టాపిక్ గా మారాయి.

జగన్ కు గట్స్ ఉన్నా..చంద్రబాబుకు ధైర్యం లేదు..
టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర రెడ్డి ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు హయాంలో కమ్మవాళ్లు కృష్ణా, గోదావరిలో కలిసిపోయారని.. నామినేటెడ్‌ పోస్టులు రెడ్లకు ఇచ్చినందుకు జగన్‌ను అభినందిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా జగన్‌ గట్స్‌ను మెచ్చుకుంటున్నానని.. అయితే చంద్రబాబుకు ఆ ధైర్యం లేదని విమర్శించారు. అసెంబ్లీలో రాయలసీమ ప్రాజక్టులపై జగన్ బాగా మాట్లాడారని.. ఆశయం బాగానే ఉన్నా.. ఆచరణ సాధ్యమేనా అని ప్రశ్నించారు. డబ్బులు లేవుగా అంటూ రాష్ట్ర ఆర్థికపరిస్థితిని గుర్తు చేశారు. ఆరోగ్య శ్రీ పధకం లో మాత్రం జగన్ తీసుకున్న నిర్ణయానికి హాట్సాఫ్ అంటూ జేసీ అభినందించారు. ఇది ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసే నిర్ణయమని అభినందించారు.

Ex Mp JC Diwakar reddy setires and apprications on CM Jagan

తాత రాజారెడ్డి మార్క్‌ పాలన..
నాడు వైయస్సార్ హాయంలో తండ్రి రాజారెడ్డి పాలన సాగిస్తే..నేడు జగన్ హయాంలో తాత రాజారెడ్డి మార్క్‌ పాలన సాగుతోందన్నారు. నెల్లూరులో మాఫియాలు ఉన్నాయని ఆనం అనకుండా ఉండాల్సిం దన్నారు. ఎక్కడ మాఫియా లేదో చెప్పమనండంటూ ఎదురు ప్రశ్న వేశారు. ఆర్జీవీ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాపై మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి సెటైర్ వేశారు. రాంగోపాల్‌ వర్మకు సినిమా పేరు పెట్టడం తెలియదని.. అసలా సినిమాకు రెడ్డి రాజ్యంలో కక్షరాజ్యం అని పేరు పెట్టాల్సిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు జేసీ చేసిన ఈ వ్యాఖ్యల పైన అసెంబ్లీ లాబీల్లో పార్టీలకు అతీతంగా నేతల మధ్య చర్చకు కారణమయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+