పట్టిసీమకు, రాయలసీమకు ఉన్న సంబంధం ఏంటి?: బాబును ప్రశ్నించిన ఉండవల్లి
అమరావతి: పట్టిసీమ ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేయడాన్ని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ తప్పుబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టిసీమ ప్రాజెక్టు అవసరం లేదన్నారు.
ముడుపుల కోసమే పట్టిసీమ ప్రాజెక్టు కడుతున్నారని ఆయన ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టు పనులు పది శాతం కూడా పూర్తి కాలేదని చెప్పిన ఆయన, ఇలా అసంపూర్తిగా ఉన్న ఒక ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం ఎప్పుడూ జరగలేదన్నారు.
పట్టిసీమకు, రాయలసీకు ఉన్న సంబంధం ఏంటని ఉండవల్లి సూటిగా ప్రశ్నించారు. రాయలసీమకు పప్పన్నం పెడుతుంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని చంద్రబాబు అంటున్నారని... పప్పన్నం కాదు గన్నేరుపప్పు పెడుతున్నారని ధ్వజమెత్తారు.

కృష్ణానదిలోకి మళ్లించిన నీరు తాటిపూడి ఆయకట్టు నీరని పట్టిసీమ నీరు కాదని స్పష్టం చేశారు. పట్టిసీమ ప్రాజెక్టుకపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా పట్టిసీమ ఎందుకు తలపెట్టారని ప్రశ్నించారు.
పట్టిసీమ ప్రాజెక్టు వ్యవహారాన్ని చూస్తుంటే, దేవతా వస్త్రాల కథ గుర్తుకు వస్తోందన్నారు. నదుల అనుసంధానం పేరుతో గోదావరి నీటిని విశాఖపట్నంకు తీసుకొస్తానని సీఎం చంద్రబాబు గొప్పులు చెబుుతున్నారని ధ్వజమెత్తారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి అనేది చంద్రబాబు నాయుడు తన సొంత మనుషుల కోసం కట్టుకుంటున్న ప్రాకారమని మాజీ ఎంపీ ఉండవల్లి ఈ సందర్భంగా విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications