పవన్ ను కలుస్తా, గుట్టు విప్పుతా - వైసీపీ మాజీ నేత..!!
గోదావరి కేంద్రంగా రాజకీయం మారుతోంది. కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి పార్టీల్లో ఆసక్తి కర లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. భీమవరం డీఎస్పీ జయసూర్య పైన విచారణ కోసం పవన్ ఫిర్యాదు చేయటం.. రఘురామ వ్యాఖ్యలు చర్చగా మారాయి. ఇప్పుడు ఈ వ్యవహారం పైన 2019 ఎన్నికల్లో పవన్ ను ఓడించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ స్పందించారు. రఘురామ చెప్పింది నిజమని చెప్పకొచ్చారు. పవన్ ను కలుస్తానని... అసలు గుట్టు విప్పుతానని గ్రంధి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
2019 ఎన్నికల్లో భీమవరంలో పవన్ ను ఓడించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేసారు. తాజాగా భీమవరంలో పేకాట నిర్వహణ.. డీఎస్పీ జయసూర్య పైన పవన్ ఫిర్యాదు అంశం.. దీని పైన డిప్యూటీ స్పీకర్ రఘురామ చేసిన కామెంట్స్ రాజకీయంగా కూటమి లో చర్చగా మారాయి. కాగా.. ఇప్పుడు స్పందించిన మాజీ ఎమ్మెల్యే గ్రంధి భీమవరంలో పేకాట వ్యవహారం పైన పవన్ కళ్యాణ్ స్పందించడం హర్షనీయమన్నారు. తాను పవన్ ను కలిసి అన్నీ చెప్పాలని ఉందని.. తనకు అప్పాయింట్ మెంట్ ఇస్తే అన్నీ బయట పెడతానని చెప్పకొచ్చారు. ఇక, భీమవరం లో జరుగుతున్న పలు అంశాలపై కూడా గ్రంధి స్పందించారు.

భీమవరంలో 14 నెలలుగా క్లబ్ నుండి డబ్బు వసూలు చేస్తున్న వాళ్ళు, రెండు నెలలు గా ఆదాయం రాకపోవడంతో పోలీసు అధికారిని టార్గెట్ చేశారని చెప్పారు. ఆ పోలీస్ అధికారి మీద పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేయడం చాలా దారుణమని గ్రంధి వ్యాఖానించారు. పోలీసు అధికారి పేకాట ఎప్పుడు ఆపారో.. అప్పుడు వాళ్లకు వ్యతిరేకం అయ్యారని గ్రంధి చెప్పుకొచ్చారు. రెండు నెలలుగా పేకాట ఆపారని వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 14 నెలలు పేకాట జరిగిందని చెప్పారు. ప్రజాప్రతినిధి, అధికార కూటమికి చెందిన వ్యక్తి ప్రతి క్లబ్ నుండి 10 లక్షలు తీసుకుంటున్నాడని ప్రజలు చర్చించుకుంటున్నారని వివరించారు. ఒక్కో బ్రాందీ షాపు నుండి నెలకు నాలుగున్నర లక్షలు తీసుకుంటున్నారని అనుకుంటున్నారని గ్రంధి వెల్లడించారు. డిఎస్సీ జయసూర్య విషయంలో రఘరామకృష్ణరాజు చెప్పింది కరెక్ట్ అని గ్రంధి శ్రీనివాస్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications