వైసీపీ మాజీ ఎంపీ ప్రచార రథం తగలబెట్టింది వైసీపీ కార్యకర్తనే.. ఎందుకంటే!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల తర్వాత అధికార టీడీపీ కూటమి నేతలకు, వైసీపీ నేతలకు మధ్య రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తాజాగా రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ప్రచారరథాన్ని తగలబెట్టిన కేసు కీలక మలుపు తిరిగింది. రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ప్రచారరథం దగ్ధం వ్యవహారం వైసిపి వర్సెస్ టిడిపిగా కొనసాగుతున్న వేళ ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

మార్గాని భరత్ ప్రచార రథం దగ్ధం కేసులో కీలక పరిణామం
ఈ కేసులో కీలక నిందితుడు ఎవరో తెలిసిన రాజమండ్రి వాసులంతా ఒకసారి గా షాక్కు గురయ్యారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం రాజమండ్రి నగరంలోని వీఎల్ పురానికి చెందిన దంగేటి శివాజీ వైసీపీ కార్యకర్త. మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తండ్రి నాగేశ్వరరావుకు అనుచరుడు.

Ex-YSRCP MP margani bharat ram campaign vehicle was burnt by a YCP activist shocking twist

ప్రజల్లో భరత్ కు సానుభూతి కోసం
ఎన్నికల్లో ఓటమి తర్వాత శివాజీ టిడిపిని టార్గెట్ చేయాలని భావించి ఏదో ఒకటి చేసి నెపం టిడిపి పైన నెట్టాలని ప్లాన్ చేశాడు. అందులో భాగంగా భరత్ కు ప్రజల్లో సానుభూతి వస్తుందని ప్లాన్ చేసి మార్గాని భరత్ రామ్ ప్రచార రధాన్ని తగలబెట్టాడు. అయితే మార్గాని భరత్ రామ్ ప్రచార రథం దగ్ధం చేసిన తర్వాత ఆ నెపాన్ని తెలుగుదేశం పార్టీ పైన నెట్టే ప్రయత్నం చేశారు.

సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు చేదించిన పోలీసులు
దీనితో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించగా ఆ ప్రాంతానికి దగ్గరలోనే ఉన్న ఒక స్కూల్ వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు చేదించామని చెప్పారు . శివాజీని అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన పోలీసులు అసలు విషయం తెలిసి ఖంగు తిన్నారు. రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ రామ్ వాహనాన్ని దగ్ధం చేసింది వైసిపి కార్యకర్తని గుర్తించారు.

యూట్యూబ్లో వీడియోలు వెతికి ప్రచార రధానికి నిప్పు
శివాజీని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, యూట్యూబ్లో వీడియోలు వెతికి ప్రచార రధానికి ఎలా నిప్పు పెట్టాలో ప్లాన్ చేసుకున్నానని అతను చెప్పినట్టు పోలీసులు తెలిపారు. దోమల కాయల్, పెట్రోల్ కవర్ తో ప్రచార రథాన్ని ఏ విధంగా దగ్ధం చేయొచ్చో చూసి ఎవరికి అనుమానం రాకుండా ఈ విధంగా చేశానని వైసిపి కార్యకర్త వెల్లడించినట్లుగా పోలీసులు తెలిపారు. ప్రచార రథం దగ్ధం చేసిన తర్వాత శివాజీ మార్గాని నాగేశ్వరరావుకు కాల్ చేసినట్టుగా గుర్తించారు. నిందితుడిపై ఐపిసి సెక్షన్ 435 కింద కేసు నమోదు చేసి పోలీసులు రిమాండ్ కు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+