ఏపిలో 27 నుండి ఇంట‌ర్‌..మార్చి 18 నుండి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు : 15న‌ డీఎస్సీ మెరిట్ జాబితా..

Recommended Video

    Exams Schedule For 10th And Inter Announced By Ap Govt | Oneindia Telugu

    ఏపిలో ప‌రీక్ష‌ల కాలం మొద‌లైంది. ఒక వైపు ఎన్నిక‌ల స‌మ‌యం.. మ‌రో వైపు ప‌రీక్ష‌ల టెన్ష‌న్. వ‌చ్చే ప‌రీక్ష‌ల షెడ్యూల్ ను ఏపి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. డీఎస్సీ -2018 మెరిట్ లిస్టును ఈ నెల 15న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మంత్రి గంటా ప్ర‌క టించారు. అదే విధంగా ప‌దో త‌ర‌గ‌తి..ఇంట‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ ను సైతం విడుద‌ల చేసారు.

    ఈ నెల 27 నుండి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు
    ఏపిలో ఈ నెల 27 నుండి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు జ‌రుగుతాయ‌ని మంత్రి ప్ర‌క‌టించారు. ఇంటర్‌ పరీక్షలు ఈ నెల 27 నుంచి మార్చి 18 వరకు జరుగుతాయి. 1,430 పరీక్షా కేంద్రాల ద్వారా ఇంటర్‌ ప్రథమ(5,07,302), ద్వితీయ(5,10,298) సంవత్స రాలకు చెందిన 10,17,600 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్న‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.

    ఇక‌, ఇంట‌ర్ ఫ‌లి తాల‌ను ఏప్రిల్ 4న విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇక‌, ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరగనున్నాయి. 6,21,623 మంది రెగ్యులర్‌, 1,070 మంది ఓరియంట్‌ ఎస్‌ఎస్‌సీ, ఒక్కసారి పరీక్ష తప్పిన ప్రైవేటు విద్యా ర్థులు 11,300 మంది 2,838 పరీక్షా కేంద్రాల్లో ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు రాయబోతున్న‌ట్లు మంత్రి ప్ర‌క‌టించారు.

    Exams Schedule released : inter exams from 27th..10 exams from march 18th.

    15న డీఎస్సీ మెరిట్ లిస్టు..
    డీఎస్సీ-2018 మెరిట్‌ జాబితా(లిస్టు)ను ఈనెల 15న విడుదల చేయబోతున్నట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. 2018 డీఎస్సీ 7,902 పోస్టుల కోసం 5,05,547 మంది (85.81శాతం) పరీక్షలకు హాజరయిన‌ట్లు ప్ర‌భుత్వం చెబుతోంది. ఈ నెల‌ 15న మెరిట్‌ జాబితా విడుదల చేస్తామ‌ని మంత్రి ప్ర‌క‌టించారు.

    ప‌రీక్ష ల కోసం అన్ని ఏర్ప‌ట్లు చేస్తున్నామ‌ని వివ‌రించారు. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష కోసం వంద సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా తో పాటుగా .. 150 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ల నియామకం చేస్తున్న‌ట్లు వివ‌రించారు. అన్ని కేంద్రాలకు సరిపడా ఫర్నీచర్‌ సిద్ధం చేసామ‌ని..ఏప్రిల్‌ 27న ఫలితాలు విడుదల చేయాల‌ని నిర్ణ‌యించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+