ఏకపక్షం కాదు, డేంజర్ బెల్స్ - జగన్, చంద్రబాబు అలర్ట్..!!
ఏపీలో అధికారం దక్కేదెవరికి. ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. కానీ, స్పష్టత రాలేదు. సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ భిన్నమైన అంచనాలను వెల్లడించాయి. టీడీపీ కూటమికి అనుకూలంగా కొన్ని..వైసీపీకి అనుకూలంగా మరి కొన్ని సంస్థలు తమ లెక్కలు ప్రకటించాయి. ఇదే సమయంలో మరిన్ని కీలక అంశాలను ఎగ్జిల్ పోల్స్ బయట పెట్టాయి. కౌంటింగ్ వేళ ఈ హెచ్చరికలు జగన్..చంద్రబాబుకు డేంజర్ బెల్స్ గా మారాయి. తుది ఫలితం పైన ఉత్కంఠ పెంచుతున్నాయి.
ఏకపక్షం కాదు
ఏపీలో ఫలితం ఏకపక్షం కాదని ఎగ్జిట్ పోల్స్ తేల్చేసాయి. ఏ ఒక్కరు ప్రచారం చేసుకుంటున్నట్లుగా గెలిచే పరిస్థితి లేదని క్లారిటీ వచ్చింది. కౌంటింగ్ లోనూ అనూహ్య ఫలితాలు వస్తాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జగన్ గెలుస్తాయని అంచనాలను ప్రకటించిన సంస్థల లెక్కల్లోనూ 120 గరిష్ఠ సీట్ల సంఖ్యగా ఉంది. తాను అమలు చేసిన సంక్షేమం..సామాజిక సమీకరణాలు పక్కాగా వర్కవుట్ అవుతాయని జగన్ పూర్తి ధీమాగా కనిపించారు. కానీ..ఫలితాల్లో మాత్రం ఆ స్థాయిలో మద్దతు కనిపించలేదు. అదే విధంగా జగన్ కేబినెట్ లోని మంత్రులు పలువురు ఓటమి బాట పడుతున్నారు.

డేంజర్ బెల్స్
జగన్ దాదాపు 80 మంది అభ్యర్దులను మార్చారు. సామాజిక లెక్కలకే ప్రాధాన్యత ఇచ్చారు. మేనిఫెస్టోలోనూ పెద్దగా మార్పులు చేయలేదు. కానీ, జగన్ లెక్కలు అర్బన్ ప్రాంతంలో దెబ్బ తిన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. జగన్ నమ్మకం పెట్టుకున్న సామాజిక లెక్కలు పూర్తి స్థాయిలో ఓటుగా మారలేదనే విషయం అర్దమవుతోంది. తాను అభ్యర్దుల కంటే వారి సామాజిక నేపథ్యానికే ఇచ్చిన ప్రాధాన్యత గెలుపుకు పూర్తి స్థాయిలో సహకరించినట్లు కనిపించటం లేదు. మహిళలు, పథకాల లబ్ది దారులు మాత్రం జగన్ కు మద్దతుగా నిలిచినట్లు సర్వే సంస్థలు చెబుతున్నాయి. కొన్ని వర్గాలను జగన దూరం చేసుకోవటం వలన ఆశించిన లక్ష్యం నెరవేరటం సాధ్య పడటం లేదనేది మరో విశ్లేషణ.
తుది ఫలితంపై ఉత్కంఠ
ఇక..చంద్రబాబు టీం పూర్తిగా జగన్ వ్యతిరేకత పైనే ఆధారపడ్డారు. మేనిఫెస్టోతో ప్రజలను ఒప్పించే ప్రయత్నం జరగలేదు. డెవలప్ మెంట్, రాజధాని అంశంలో మాత్రం చంద్రబాబుకు అనుకూలత కనిపించినట్లు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో జగన్ ను ఆశించిన స్థాయిలో చంద్రబాబు నిలువరించ లేకపోయినట్లు కనిపిస్తోంది. అదే విధంగా ఆరు జిల్లాల్లో ఏకపక్షంగా సీట్లను సాధిస్తామనే నమ్మకాన్ని జగన్ గండి కొట్టారు. తొలి నుంచి టీడీపీకి మద్దతుగా నిలిచిన కొన్ని వర్గాలను జగన్ తన వైపు తిప్పుకోగలిలారు. అయితే..ఈ అంశాలన్నీ ఎన్నికల్లో ప్రభావం చూపినట్లు నిర్దారణ అవుతున్నా..తుది ఫలితం తరువాత మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో..తుది ఫలితం పైన మరింత ఆసక్తి పెరుగుతోంది.












Click it and Unblock the Notifications