తిరుమలలో విశేషం: గోవిందుడి నామస్మరణ మధ్య.. !!
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీలో మార్పు లేదు. తాకిడి కొనసాగుతోంది. సోమవారం 70,044 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 27,241 మంది తలనీలాలను సమర్పించుకుంటోన్నారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 20 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోతున్నాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 8 నుంచి 10 గంటల కొద్దీ సమయం పట్టింది. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 5.08 కోట్ల రూపాయల కానుకలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అందాయి.
కాగా- తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా ఆరంభం అయ్యాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. సోమవారం తెల్లవారు జామున 6:30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగడంతో ఈ విశేష పర్వదినం మొదలైంది.

నేడు రెండోరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామివారు బంగారు రథంపై ఊరేగారు. ఈ ఉదయం 8 నుండి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో అశేష భక్తులను కటాక్షించారు. గోవిందుడి నామాన్ని స్మరిస్తూ వేలాదిమంది భక్తులు ఈ రథోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారికి హారతులు పట్టారు. అడుగడుగునా నీరాజనాలు అర్పించారు. భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగారు.
టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి సహా పలువురు అధికారులు ఇందులో పాల్గొన్నారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అభిషేకించారు. చివరిరోజైన బుధవారం నాడు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు.
వసంత రుతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవమని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో మార్చి 30 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు మూడురోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దయ్యాయి. వీటితో పాటు నేడు అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.
-
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ!












Click it and Unblock the Notifications