బొబ్బిలిలోని ఇంట్లో భారీ పేలుడు పదార్థాలు: మావోయిస్టుల కోసమేనా?
విజయనగరం: విజయనగరం జిల్లాలోని బొబ్బిలిలోని ఓ ఇంట్లో భారీ పేలుడు పదార్థాలు పోలీసులను దిగ్భ్రమకు గురి చేశాయి. తమకు అందిన సమాచారం మేరకు పోలీసులు శ్రీనివాస రావు అనే వ్యక్తి ఇంటిపై అకస్మాత్తుగా దాడి చేసి, సోదాలు నిర్వహించారు.
శుక్రవారం నిర్వహించిన ఈ సోదాల్లో శ్రీనివాస రావు నివాసంలో 800 జిలిటెన్ స్టిక్స్, 5 వేల డెటోనేటర్లు లభించాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని, శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. అతన్ని పోలీసులు విచారిస్తున్నారు.

మావోయిస్టులకు చేరవేయడానికే శ్రీనివాస రావు వాటిని నిల్వ చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. పాచిపెంటకు పంపించడానికి వాటిని నిల్వచేసినట్లు శ్రీనివాస రావు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. బొబ్బిలి ప్రాంతంలో మావోయిస్టు సానుభూతిపరులు ఎక్కుగా ఉన్నారని అనుమానిస్తున్నారు.
ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో మావోయిస్తుల కదలికలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పేలుడు పదార్థాలను మావోయిస్టులకు చేరవేయడానికే నిల్వ చేసినట్లు కూడా అనుమానిస్తున్నారు. స్థానికులు శ్రీనివాస రావుకు అనుమానం రాకుండా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అతని ఇంటిపై దాడి చేశారు. దీంతో పెద్ద ముప్పు తప్పిందని భావిస్తున్నారు.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్‌తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!












Click it and Unblock the Notifications