విజయవాడ, చీరాల, ఒంగోలు ప్రజలకు ముఖ్య గమనిక

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ-ఒంగోలు మార్గంలో సూరారెడ్డిపాలెం వల్ల మూడోలైను నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో అధికారులు కొన్ని రైళ్లను రద్దుచేశారు. ఈ నెల 16న హౌరా-ఎర్నాకుళం మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌, ఈ నెల 18న ఎర్నాకుళం-హౌరాల మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ రైలును రద్దు చేశారు.

సంత్రాగచ్చి-తాంబరం మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ రైలును ఈ నెల 18న, 0తాంబరం-సంత్రాగచ్చి మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ రైలును ఈ నెల 13,20 తేదీల్లో రద్దు చేశారు. హౌరా-మైసూర్‌ మధ్య నడిచే ఎక్స్ ప్రెస్‌ రైలును ఈ నెల 15న, మైసూర్‌-హౌరా మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ రైలును ఈ నెల 17న రద్దు చేశారు.

express trains cancelled in south central railway

ఈ నెల 15న సంత్రాగచ్చి-చెన్నై మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ ను, ఈ నెల 17న చెన్నై-సంత్రాగచ్చి మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ రైలును రద్దు చేశారు. షాలీమార్‌-సికింద్రాబాద్‌ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ నెల 13న, సికింద్రాబాద్‌-షాలిమార్‌ మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ నెల 15న రద్దయ్యాయి. టాటా-యశ్వంత్‌పూర్‌ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ నెల 14న, యశ్వంత్‌పూర్‌-టాటా మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ నెల 17న రద్దయ్యాయి. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు కోరారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు భారతీయ రైల్వే ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే డబుల్ లైన్ ఉన్నచోట, రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మూడోలైను నిర్మాణాన్ని చేపడుతోంది. సింగిల్ ట్రాక్ ఉండే మార్గాల్లో డబుల్ ట్రాక్ ను అందుబాటులోకి తెస్తున్నారు. దీనిలో భాగంగానే సూరారెడ్డిపాలెం దగ్గర పనులు జరుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+