భార్య పుట్టింటికి వెళ్లింది: భర్తకు నర్సుతో అక్రమ సంబంధం, చివరకిలా...

ఓ నర్సుతో అక్రమ సంబంధం కొనసాగించిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.

కాకినాడ: ఓ నర్సుతో అక్రమ సంబంధం కొనసాగించిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం రాజమహేంద్రవరం అర్బన్‌ ఎస్పీ బి.రాజకుమారి ఆ విషయం చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలోని ముక్కినాడకు చెందిన మట్టపర్తి మణికంఠేశ్వరసామి (25) అనపర్తిలోని ఓ నేత్ర వైద్య ఆసుపత్రిలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

ఇటీవల గంగవరం మండలం నరజాడకు చెందిన తన మేనత్త కూతురు సుబ్బలక్ష్మితో తొమ్మిది నెలల క్రితం పెళ్లి జరిగింది. ఇక్కడ పనిచేస్తున్న నర్సుతో మణికంఠేశ్వరస్వామికి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.భార్య సుబ్బలక్ష్మి ఆషాఢమాసం కావడంతో పుట్టింటికి వెళ్లింది.

ఈ నేపథ్యంలో మణికంఠేశ్వరస్వామి స్నేహితుడైన పేరారామచంద్రపురానికి చెందిన సురేష్‌, నర్సుతో కలిసి ఈ నెల 20న రాజమహేంద్రవరంలో సినిమాకి వెళ్లారు. సినిమా చూసిన తర్వాత హోటల్లో భోజనం చేసి బయలుదేరారు.

నర్సును అక్కడ దింపి...

నర్సును అక్కడ దింపి...

నర్సును అనపర్తి, సురేష్‌ను పేరారామచంద్రపురంలో దింపి మణికంఠేశ్వరస్వామి ముక్కినాడకు మోటార్‌ సైకిల్‌పై బయలు దేరాడు. ముక్కినాడ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు వెనక నుంచి బలమైన ఆయుధంతో తలపై బలంగా కొట్టారు. దీంతో మణికంఠ అక్కడికక్కడే మృతిచెందాడు.

Recommended Video

    Call Centre Girl Burned Alive In Madhapur at Hyderabad
    శవాన్ని పొలం పడేసి...

    శవాన్ని పొలం పడేసి...

    హతుడి శరీరాన్ని సమీపంలోని పొలాల్లో పడేసి, మృతుడి వద్ద ఏ విధమైన ఆధారాలు లభించకుండా జాగ్రత్త పడ్డారు. అతడి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ కూడా తీసుకెళ్లారు. మణికంఠ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి దుర్గ ఫోన్‌ చేయగా రాజమహేంద్రవరం నుంచి వస్తున్నట్టు సమాధానమిచ్చాడు.

    తల్లి మరోసారి ఫోన్...

    తల్లి మరోసారి ఫోన్...

    రాత్రి 11 గంటలు గడుస్తున్నా ఇంటికి రాకపోవడంతో తల్లి మరోసారి ఫోన్‌ చేసింది. అయితే ఫోన్ స్విచ్‌ ఆఫ్‌ అయ్యింది. ఉదయం సమీపంలోని పొలాల్లో విగత జీవుడిగా పడి ఉన్నట్టు స్థానికులు చెప్పారు. దాంతో కుటుంబసభ్యుల్లో విషాదం చోటు చేసుకుంది.

    పోలీసుల దర్యాప్తు...

    పోలీసుల దర్యాప్తు...

    సంఘటనా స్థలాన్ని అర్బన్‌ ఎస్సీ బి.రాజకుమారి, డీఎస్పీ కె.రమేష్‌బాబు, రాజానగరం సీఐ కె.వరప్రసాద్‌, ఎస్‌ఐ రాజేష్‌ సందర్శించారు. శవపంచనామా తర్వాత పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+